సాగర్ సర్వేలో తేలిందదేనా?

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక త్వరలో జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా కె. జానారెడ్డిని అధిష్టానం ప్రకటించింది. జానారెడ్డి గత కొద్ది రోజులుగా సాగర్ లో ప్రచారం [more]

Update: 2021-02-16 09:30 GMT

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక త్వరలో జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా కె. జానారెడ్డిని అధిష్టానం ప్రకటించింది. జానారెడ్డి గత కొద్ది రోజులుగా సాగర్ లో ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ లు అభ్యర్థులపై మల్లగుల్లాలు పడుతున్న సమయంలో జానారెడ్డి మాత్రం ముందుగానే అభ్యర్థిగా ప్రచారం చేసుకోవడం అడ్వాంటేజీగా మారింది. అయితే అంతకు ముందు జానారెడ్డి తన కుమారుడిని బరిలోకి దింపాలని భావించారు.

తన పేరు ప్రకటించినా…..

తన కుమారుడి భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని జానారెడ్డి అధిష్టానం తనను అభ్యర్థిగా ప్రకటించినా చివరి నిమిషంలో తన కుమారుడు రఘువీర్ రెడ్డిని నిలబెట్టాలనుకున్నారు. అందుకు గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేశారు. తానయినా, తన కుమారుడు అయినా ఒకటేనని ఆయన భావించారు. పార్టీ నేతలందరూ ఏకతాటిపైకి వచ్చేంత వరకూ తన పేరును అభ్యర్థిగా ఉండటమే బెటర్ అని భావించారు. కానీ ఆయన మనసులో మాట బయటపెట్టడంతో కాంగ్రెస్ నేతలు కూడా అప్రమత్తమయ్యారు.

సర్వే రిపోర్టులో…..

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో జానారెడ్డి, రఘువీర్ రెడ్డి పేరిట కాంగ్రెస్ పార్టీ సర్వే చేయించిందట. ఈ సర్వేలో జానారెడ్డి అయితే నే గెలుస్తారని, రఘువీర్ రెడ్డి అయితే ఓటమి తప్పదని తేలిందట. దీంతో సర్వే నివేదికను జానారెడ్డి ముందు పెట్టారట. రఘువీర్ రెడ్డికి ఈసారి అవకాశం వద్దని, జానారెడ్డి పోటీ చేస్తేనే గెలుస్తామని అధినాయకత్వానికి కూడా ముందస్తుగానే సమాచారంతో పాటు సర్వే నివేదికను కూడా పంపారట.

హైకమాండ్ కు ముందుగా….

ఎందుకంటే జానారెడ్డి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వరకూ పీసీసీ చీఫ్ ను ప్రకటించవద్దని హైకమాండ్ కోరడంతో వెంటనే అంగీకరించింది. ఇప్పుడు అభ్యర్థిగా తన కుమారుడి పేరును జానారెడ్డి కోరినా వినకుండా ఉండేందుకు ముందుగానే కాంగ్రెస్ నేతలు సర్వే నివేదికను హైకమాండ్ కు పంపారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఫైనల్ గా ఇక జానారెడ్డి తప్ప కాంగ్రెస్ నుంచి ఎవరి పేరు వినపడటానికి వీల్లేదని అధినాయకత్వం కూడా సూచించింది.

Tags:    

Similar News