పార్టీ మనిషే షాకిచ్చాడా ?

జనసేనాని పవన్ కళ్యాణ్ వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలను అన్నీ కలిపి చూస్తే కలగాపులగంగా ఉంటుంది. ఆయన వివేకానందుడి ప్రస్తావనకు తెస్తూనే చెగువేరా అంటారు. హింధూ ధర్మం [more]

Update: 2019-12-07 11:36 GMT

జనసేనాని పవన్ కళ్యాణ్ వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలను అన్నీ కలిపి చూస్తే కలగాపులగంగా ఉంటుంది. ఆయన వివేకానందుడి ప్రస్తావనకు తెస్తూనే చెగువేరా అంటారు. హింధూ ధర్మం అని చెబుతూనే మార్క్స్ సిధ్ధాంతాలను వల్లె వేస్తారు. ఇక పవన్ మాట్లాడిన మాటలు చాలా సార్లు వివాదం కావడానికి పరస్పర విరుధ్ధ భావజాలాన్ని మిక్స్ చేయడమే కారణం అంటారు. ఇదిలా ఉండగా పవన్ తాజాగా మతాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆయన హిందూమతంలోనే వివాదాలు స్రుష్టించేవారు ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. దాని మీద బీజేపీ నుంచి గట్టి రియాక్షనే వచ్చింది. ఆ మరుసటి రోజునే ఆయన విజయవాడలో పున్నమి ఘాట్స్ వద్ద సామూహిక మత మార్పిళ్ళు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలను ఎవరూ సీరియస్ గా పట్టించుకోకపోయినా ఆయన పార్టీలోని ఒక నాయకుడే తిరిగబడడం ఇక్కడ విశేష పరిణామం.

అధినేత మీదనే ఫిర్యాదు :

విశాఖ అర్బన్ జిల్లా భీమిలీ నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు అలీవర్ రాయ్. ఆయన విద్యాసంస్థలను కూడా నడుపుతూంటారు. రాష్ట్ర క్రిస్టియన్ సంఘం నాయకుడు గా కూడా ఆయన ఉన్నారు. ఆయన 2019 ఎన్నికల్లో జనసేన టికెట్ కూడా ఆశించారు. చివరి క్షణంలో పవన్ తన సామాజిక వర్గానికి చెందిన పంచకర్ల సందీప్ కి భీమీలీ టికెట్ ఇచ్చారు. అయినా ఆయన సహకరించి పార్టీలో కొనసాగుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే అలీవర్ రాయ్ వరసగా మత మార్పిళ్ళ మీద తమ నాయకుడు పవన్ చేస్తున్న విమర్శలపైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో మత మార్పిళ్ళు పెద్ద ఎత్తున జరిగిపోతున్నాయంటూ పవన్ పెడుతున్న గగ్గోలుపైన అలీవర్ రాయ్ సీరియస్ గానే ఉన్నారట. ప్రత్యేకించి జగన్ క్రిస్టియన్ కావడంతో ఆ మతాన్ని పవన్ టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలపైన కూడా ఆయన నొచ్చుకుంటున్నారట. దీని మీద పవన్ ని కలసి మత మార్పిళ్ళు అంటూ ఎక్కడా జరగడంలేదని, తమ మనోభావాలను అర్ధం చేసుకోవాలని చెప్పి చూశారట. అయినా పవన్ వినకపోవడంతో అధినేత మీదనే అలీవర్ రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషమే మరి.

చేటు తెస్తోందా :

నిజానికి ఏపీలో మతాల మంటలు లేవు. అంతా కలసి ఒక్కటిగా ఉంటారు. ఇక మత మార్పిళ్ళు అన్నవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. దానికి ప్రభుత్వాలతో పని లేదు, ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరిస్తారు. ఈ సంగతే రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత కూడా చెప్పారు. అయినా పవన్ మాత్రం గత కొంతకాలంగా మతాల మీద విమర్శల బాణాలు ఎక్కుపెడుతూ వస్తున్నారు. దాని వల్ల ఎంతవరకూ పొలిటికల్ మైలేజ్ దక్కిందో తెలియదు కానీ డ్యామేజ్ మాత్రం బాగానే జరుగుతోందని అంటున్నారు. ఏపీలో ముస్లింలు, క్రిస్టియన్లు పెద్ద ఎత్తున ఉన్నారు. వారిలో కూడా పవన్ అభిమానులు ఉన్నారు. మరి పవన్ పదే పదే బీజేపీ గొంతుతో ఇతర మతాల గురించి మాట్లాడడంతో వీరంతా కూడా వ్యతిరేకం అవుతున్నారు. ఏపీలో మతం కార్డుని ఉపయోగించి బీజేపీ బావుకున్నది ఏదీ లేదని అర్ధమైన తరువాత కూడా పవన్ అదే బాటలో నడవడం అంటే ఆయన చెబుతున్న లౌకికవాదం అసలు కధ ఏంటో అర్ధమవుతోందని అంటున్నారు. పైగా అమిత్ షా, మోడీలను పవన్ పొగడడం, బీజేపీకి దగ్గర కావాలని చూడడం వంటి పరిణామాల నేపధ్యంలో ఆయన పార్టీలో కొద్దో గొప్పో ఉన్న మైనారిటీ నాయకులు కూడా బయటకు వెళ్ళేందుకు రెడీ అవుతున్నారని అంటున్నారు.

Tags:    

Similar News