జనంలోకి జగన్… బాబు బందీయేనా ?

కరోనా వైరస్ కి రావడమే తప్ప పోవడానికి దారి తెలియదు అని అంటున్నారు. కరోనాతో దైనందిన జీవితం ఒక విధంగా స్లంభించింది. అయితే ఇది ఇప్పట్లో పోయేది [more]

Update: 2020-10-16 00:30 GMT

కరోనా వైరస్ కి రావడమే తప్ప పోవడానికి దారి తెలియదు అని అంటున్నారు. కరోనాతో దైనందిన జీవితం ఒక విధంగా స్లంభించింది. అయితే ఇది ఇప్పట్లో పోయేది కాదని తలచి జనం ఎవరి మటుకు వారు తమ పనులు చేసుకుంటూ వస్తున్నారు. జగన్ అయితే కరోనా వేళ కూడా తన క్యాంప్ ఆఫీస్ నుంచి సమీక్షలు నిర్వహిస్తూవచ్చారు. ఏ ఒక్క సంక్షేమ పధకాన్ని ఆయన ఆపలేదు. ఇక ముఖ్యమైన వాటికి శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా ఆయన‌ జగన్ చేస్తూ వచ్చారు. ఇక ఇపుడు జగన్ నేరుగా జనంలోకి వస్తున్నారు. తాజాగా ఆయన జగనన్న విద్యా కానుకను ప్రజల మధ్యనే ప్రారంభించారు.

ఇక ఇదే తోవలో……

జగన్ గతంలో మాదిరిగానే కనీస జాగ్రత్తలు కొన్ని తీసుకుని జనంలోకి రావాలనుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఏపీలో కరోనా కట్టడి అవుతున్నందువల్ల ప్రజల మధ్యలోనే పధకాల ప్రారంభోత్సవాలు ఉండాలని జగన్ నిర్ణయించుకున్నారు. దీనివల్ల ప్రభుత్వం మరింత సన్నిహితంగా జనంలోకి వెళ్తుందని ఆయన నమ్ముతున్నారు. నిజానికి గత తొమ్మిది నెలలుగా ప్రభుత్వాధినేతగా జగన్ వీడియో సమావేశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఇపుడు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. జనంతో తాను అన్నట్లుగా మునుపటి దూకుడును చూపనున్నారు.

ప్రజా దర్బార్ కూడా……

ఇక సచివాలయానికి కూడా జగన్ వెళ్లాలని తీర్మానించుకున్నట్లుగా చెబుతున్నారు. క్యాంప్ ఆఫీస్ కంటే కూడా సచివాలయం నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో మంత్రులు కూడా ఠంచనుగా సెక్రట్రేరియట్ కి వస్తారు. అధికారుల పనితీరు మారుతుంది. దాంతో మంచి ముహూర్తం చూసుకుని సచివాలయం నుంచే పాలన అని జగన్ భావిస్తున్నారుట. అదే విధంగా ప్రతీ రోజూ అక్కడ ప్రజలను కలిసేందుకు కూడా జగన్ అజెండా పెట్టుకున్నారని అంటున్నారు. తన తండ్రి బాటలో ప్రజా దర్బార్ నిర్వహించేందుకు కొడా జగన్ రెడీ అవుతున్నారని చెబుతున్నారు.

బాబుకు బ్రేకులేనా….?

చంద్రబాబు మాత్రం కరోనా దెబ్బకు హైదరాబాద్ లోని తన ఇంటికే పరిమితం అయిపోయారని విమర్శలు ఉన్నాయి. విజయవాడ వచ్చినా రెండు, మూడు రోజులు మాత్రమే ఉంటున్నారు. పార్టీ నాయకులు గట్టిగా అడిగినా కూడా ఇప్పట్లో రాకూడదని చంద్రబాబు గట్టిగా తీర్మానించుకున్నారుట. మరి వైరస్ ఎపుడు తగ్గుతుంది అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. జగన్ చూస్తూంటే జనంలోకి వెళ్ళిపోతున్నారు. అది అధికార పార్టీకి అతి పెద్ద ప్లస్ గా మారుతుందనడంతో సందేహం లేదు. కొత్త సంవత్సరం వచ్చాక ఎటూ లోకల్ బాడీ ఎన్నికలకు తెర తీయడానికి కూడా జగన్ సిద్ధంగా ఉంటారు. మరి అంతా ఏకపక్షం చేయడానికి జగన్ చూస్తూంటే బాబు మాత్రం బందీగా తన ఇంట్లో ఉండిపోవడాన్ని తమ్ముళ్ళు అసలు జీర్ణించుకోలేకపోతున్నరుట. ఇదే తీరు కొనసాగితే వైసీపీ దూకుడుకు ఎప్పటికీ టీడీపీ కనీసం అడ్డుకట్ట వేసే ప్రయత్నం కూడా చేయలేదని అంటున్నారు.

Tags:    

Similar News