ఉత్తరాంధ్ర వైసీపీ విభీషణులకు వెన్నులొ వణుకు

పార్టీ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి వైసీపీ అధినేత జగన్ వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ప్రతీ గడపా తొక్కారు. ప్రతీ మనిషీ భుజం తట్టారు. జగన్ [more]

Update: 2019-06-24 14:30 GMT

పార్టీ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి వైసీపీ అధినేత జగన్ వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ప్రతీ గడపా తొక్కారు. ప్రతీ మనిషీ భుజం తట్టారు. జగన్ కష్టానికి పార్టీకి మంచి బలం వచ్చింది. ఎన్నికల్లో దానిని వాడుకున్న వారు గెలిచారు. వెన్నుపోట్లు పొడిచిన చోట్ల ఓడారు. ఉత్తరాంద్ర్హ జిల్లాల వరకూ వస్తే గతంలో వైసీపీకి 9 అసెంబ్లీ సీట్లు, ఒక్క ఎంపీ ఉంటే ఈసారి 28 అసెంబ్లీ సీట్లు, నాలుగు ఎంపీ సీట్లు దక్కాయి. ఇది నిజంగా రికార్డే. టీడీపీకి కంచుకోట లాంటి జిల్లాల్లొ ఫ్యాన్ గిర్రున తిరిగిందనడానికి ఇదే ఉదాహరణ. అయితే ఇంత గాలిలో కూడా కొన్ని సీట్లు కేవలం పార్టీలో వెన్నుపోట్లు వల్లనే పోయాయని జగన్ కి నివేదికలు వచ్చాయట. అలా విభీషణ పాత్ర పోషించిన వారికి వైసీపీ అధినేత జగన్ తనదైన శైలిలో ట్రీట్మెంట్ కూడా మొదలుపెట్టేశారు.

క్రాస్ ఓటింగుకు ఫలితం అలా :

శ్రీకాకుళం జిలాలో క్రాస్ ఓటింగ్ చేసి వైసీపీ ఎంపీ ఓటమిని కారణం అయ్యారన్న ఆరోపణలు నేపధ్యంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి ఇవ్వకుండా జగన్ పక్కన పెట్టేశారు. అక్కడ కింజరపు కుటుంబంతో అనుబంధం వల్లనే ధర్మాన ఇలా చేశారని పక్కా ఆధారాలతో వైసీపీ అధినేత జగన్ కి నివేదిక రావడంతో ఈ చర్య తీసుకున్నారని టాక్. ఇపుడు అదే శ్రికాకుళం జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి క్రుపారాణి కూడా వెన్నుపోటు పొడిచి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గెలుపునకు కారణమయ్యారని టెక్కలి వైసీపీ అభ్యర్ధి పెరాడ తిలక్ ఇపుడు జగన్ కి నివేదిక ఇచ్చారు. ఎన్నికల ముందు వైసీపీలో చేరిన క్రుపారాణి రాకను ఆ పార్టీ నేతలు ఎవరూ స్వాగతించలేదు. దాంతో ఆమెకు కోరుకున్న టెక్కలి టికెట్ ఇవ్వకపోవడంతో వైసీపీ అభ్యర్ధి తిలక్ ఓటమికి పనిచేశారని అంటున్నారు. కేవలం ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో అచ్చెన్నాయుడు గెలవాడానికి క్రుపారాణి సహకారమే కారణమని తిలక్ అంటున్నారు. మరి దీని మీద జగన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న క్రుపారాణీకి చెక్ చెబుతారని అంటున్నారు.

విశాఖలో అలా :

ఇక విశాఖలో తూర్పు నియోజకవర్గం సీట్లో వైసీపీ అభ్యర్ధిని అక్రమాని విజయనిర్మలకు సహకారం అందించకుండా ఆ పార్టీ నాయకుడు వంశీ క్రిష్ణ ఇండైరెక్ట్ గా టీడీపీ అభ్యర్ధి వెలగపూడికి సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. వంశీకి గట్టి పట్టున్న చోట వెలగపూడికి ఈసారి మెజారిటీ ఓట్లు రావడాన్ని సాక్ష్యంగా చూపించి వైసీపీ అధినేత జగన్ కి ఆ పార్టీ నేతలు నివేదికలు ఇచ్చారు. అలాగే విశాఖ సౌత్ అసెంబ్లీ సీట్లోనూ వైసీపీ నేతలు కొందరు వెన్నుపోటు పొడిచారని అంటున్నారు. దాన్ని కూడా జగన్ ద్రుష్టిలో పెట్టారు. విశాఖ ఉత్తరంలో తక్కువ మెజారిటీతో పార్టీ ఓడిపోవడాన్ని కూడా జగన్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ పరిణామాలు చూస్తూంటే జగన్ మార్క్ ట్రీట్మెంట్ ఉంటుందని, నామినేటెడ్ పదవులు అసలైన వారికి, పార్టీ కోసం కష్టపడిన వారికే ఇస్తారని అంటున్నరు. ఆ విషయం తెలియడంతో విభీషణులంతా ఇపుడు వణుకుతున్నారు.

Tags:    

Similar News