వారికే ప్రాధాన్యత…జగన్ సంకేతాలిచ్చినట్లేనా?

ఒక విషయం మాత్రం స్పష్టమయింది. పార్టీలు మారి వచ్చిన నేతలకు వైసీపీలో ప్రాధాన్యత దక్కుతుందని అధినేత చర్యలతో తెలుస్తోంది. చంద్రబాబును దెబ్బతీయడానికి టీడీపీ నుంచి వచ్చే నేతలకు [more]

Update: 2020-10-23 03:30 GMT

ఒక విషయం మాత్రం స్పష్టమయింది. పార్టీలు మారి వచ్చిన నేతలకు వైసీపీలో ప్రాధాన్యత దక్కుతుందని అధినేత చర్యలతో తెలుస్తోంది. చంద్రబాబును దెబ్బతీయడానికి టీడీపీ నుంచి వచ్చే నేతలకు వైసీపీ సాదర స్వాగతం పలుకుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు. వారికి పార్టీ అధినేత జగన్ స్వయంగా కండువాలు కప్పారు. వీరు పార్టీలో అధికారంలో చేరకపోయినా వారి తనయులను చేర్చి వైసీపీకి మద్దతు పలికారు.

టీడీపీ నుంచి వైసీపీలోకి…..

అయితే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి చేరిన ఎమ్మెల్యేలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనంటున్నారట జగన్. తనను నమ్మి వచ్చిన వారికి ఖచ్చితంగా వారికిచ్చిన హామీలను అమలుచేస్తానని జగన్ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తుండటం చర్చనీయాంశమైంది. మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి రాగా అందులో రెండు నియోజకవర్గాల్లో మాత్రమే ఎక్కువగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒకటి గన్నవరం కాగా, మరొకటి చీరాల నియోజకవర్గం.

వంశీకే ప్రయారిటీ…..

గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నుంచి వచ్చిన వల్లభనేని వంశీ, వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుకు మధ్య పొసగడం లేదు. రెండు వర్గాలు గన్నవరంలో బాహాబాహీ అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఇద్దరి చేతులు కలిపి సయోధ్యగా ఉండాలని కోరారు. అయితే వివాదం సద్దుమణుగుతుందని భావించారు. జగన్ స్వయంగా చెప్పడంతో గన్నవరం సెట్ రైట్ అవుతుందనుకున్నారు. కానీ యార్లగడ్డ వెంకట్రావు వర్గం మాత్రం ఇందుకు సహకరించేంుదకు సిద్ధంగా లేదని తెలుస్తోంది.

చీరాలలో కరణానికే….

చీరాల నియోజకవర్గంలోనూ అంతే. ఇక్కడ వైసీపీ ఇన్ ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ను కాదని పార్టీలోకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం కు ప్రాధాన్యత ఎక్కువ దక్కుతుంది. దీంతో ఆమంచి ఇబ్బందిగా ఫీలవుతున్నారు. వైసీపీ అగ్రనాయకత్వం అనేకసార్లు పంచాయతీలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే అధిష్టానం మాత్రం కొత్తగా పార్టీలో వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, ఆమంచి కృష్ణమోహన్ ల వర్గాలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి.

Tags:    

Similar News