చంద్రబాబుని గెలిచేసిన జగన్

చంద్రబాబు ఫార్టీ యియర్స్ ఇండస్త్రీ. ఆయన జగన్ తండ్రి కాలం నాటి వాడు, బాబు రాజకీయాలు మొదలుపెట్టేనాటికి జగన్ ఇంకా పుట్టి ఉండరు. అటువంటిది జగన్ మోహన్ [more]

Update: 2019-06-19 08:30 GMT

చంద్రబాబు ఫార్టీ యియర్స్ ఇండస్త్రీ. ఆయన జగన్ తండ్రి కాలం నాటి వాడు, బాబు రాజకీయాలు మొదలుపెట్టేనాటికి జగన్ ఇంకా పుట్టి ఉండరు. అటువంటిది జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ. బాబు ఎక్కడ అంటూ ఇన్నాళ్ళూ వినిపించే వాదన. అసలు జగన్ మోహన్ రెడ్డి బాబు వ్యూహాల ముందు సరితూగలడా అన్నది తలపండిన రాజకీయ పండితుడు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారికి పెద్ద పెద్ద డౌట్లు కూడా వచ్చేవి. కానీ జగన్ మోహన్ రెడ్డి నిజంగా అసాధ్యుడే. బాబు వంటి రాజకీయ దురంధరున్నే గెలిచేసి శస్భాష్ అనిపించుకున్నాడు.

మొదటి గెలుపు అలా :

కానీ జగన్ మోహన్ రెడ్డి మొదట కాంగ్రెస్ నుంచి తన వైపు వచ్చే కాంగ్రెస్ ఎమ్మెల్యేల మనసు గెలుచుకున్నాడు. తరువాత కడప ప్రజల మనసు గెలుచుకుని దేశంలో రికార్డ్ స్థాయి మెజారిటీగా అయిదున్నర లక్షల ఓట్ల తేడాతో కడప ఎంపీగా తన సొంత శక్తితో గెలిచాడు. ఆ మీదట విభజన ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 67 ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు సాధించడేమే కాదు కోట్లాది ఓట్లని కొల్లగొట్టి జనం తన వైపు ఉన్నారని నిరూపించుకున్నారు. తాజా ఎన్నికల్లో ఏకంగా 50 శాతం ఓట్లు, 86 శాతం సీట్లు సాధించి ఆంద్ర్హప్రదేశ్ నాది అంటూ సగర్వంగా ప్రకటించుకున్నాడు.

శాసనసభలో జగన్ ఇలా :

ఇపుడు తొలిసారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అటు వైపు విపక్షంలో కూర్చున్న చంద్రబాబుని ఆయన రాజ‌కీయ జీవితంలో తొలిసారి వంచి మరీ జగన్ మోహన్ రెడ్డి గెలిచేశాడు. బాబు స్పీకర్ ఎన్నిక విషయంలో చేసిన తప్పుని డిప్యూటీ స్పీకర్ విషయంలో సవరించుకునేలా జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుతో నిజంగా గెలిచేశారు. అంతే కాదు, అయిదు రోజుల పాటు జరిగిన తొలి సభలోనే బాబు తప్పులన్నీ ఎత్తి చూపుతూ ఆయన కానీ ఆయన ఎమ్మెల్యేలు కానీ గట్టిగా మాట్లాడనీయలేని స్థితిని కల్పించి జగన్ మోహన్ రెడ్డి గొప్పగా గెలిచేశాడు. నిజంగా బాబు రాజకీయ జీవితంలో ఈ తరహా పేలవమైన ప్రదర్శన ఇంతకు ముందు అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నడూ లేదు. మరి జగన్ బాబుని ఎక్కడ గుచ్చాలో అక్కడే గుచ్చుతూ అసెంబ్లీ నాది అనిపించేలా చేశాడు. మొత్తానికి ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ పదేళ్ల రాజకీయం ముంది ఓడిందనే చెప్పాలి.

Tags:    

Similar News