బాబు బలమైన అనుమానం అదే

తాను చేసినట్లే అందరూ చేస్తారనుకుంటే ఎలా..? వైఎస్ జగన్ ప్రధాని మోదీని కలవడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబునాయుడుపై ఫిర్యాదులు చేసేందుకే జగన్ మోదీని [more]

Update: 2019-08-07 14:30 GMT

తాను చేసినట్లే అందరూ చేస్తారనుకుంటే ఎలా..? వైఎస్ జగన్ ప్రధాని మోదీని కలవడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబునాయుడుపై ఫిర్యాదులు చేసేందుకే జగన్ మోదీని కలిశారని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. ఈ మేరకు తనకు పక్కా సమాచారం అందిందని చెబుతున్నారు. తనపై తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదని చంద్రబాబు హెచ్చరిస్తున్నారు.

బాబుపై ఫిర్యాదుకే….

వైఎస్ జగన్ నిన్న ప్రధాని మోదీతో దాదాపు 45 నిమిషాలు భేటీ అయిన సంగతి తెలిసిందే. జగన్ రాష్ట్ర పరిస్థితిని తెలియజేస్తూ ప్రధానికి వినతి పత్రం కూడా అందించారు. పోలవరం, అమరావతి నిర్మాణాలకు నిధులు విడుదల చేయాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే చంద్రబాబునాయుడికి అందిన సమాచారం మేరకు జగన్ మోదీ తనకు కేటాయించిన 45 నిమిషాల్లో ఎక్కువ భాగం బాబుపై ఫిర్యాదులు చేయడానికే వినియోగించారని చెబుతున్నారు.

మోదీ దృష్టికి అవినీతి….

పోలవరం, అమరావతి, పీపీఏల్లో జరిగిన అవినీతి గురించి వైఎస్ జగన్ ప్రధాని వద్ద ప్రస్తావించారంటున్నారు. అందుకే తాము ప్రతి విషయంలో కమిటీలు వేశామని, కమిటీ నివేదిక అందిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా మోదీకి వివరించారని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. ఇందుకు మోదీ కూడా అవినీతిని ఎలా ప్రోత్సహిస్తామంటూ ఎదురు ప్రశ్నించారని, జగన్ ను గో ఎహెడ్ అన్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

తనను టార్గెట్ చేయడానికేనంటున్న….

దీంతో చంద్రబాబునాయుడు తనపై ఫిర్యాదు చేసేందుకే జగన్ మోదీ వద్దకు వెళ్లారంటున్నారు. తనకు ఖచ్చితమైన సమాచారం ఉందంటున్నారు. గతంలో చంద్రబాబు కూడా మోదీని కలసినప్పుడు వైఎస్ జగన్ కేసుల విషయం ప్రస్తావించారని అప్పట్లో వైసీపీ నేతలు కూడా విమర్శించారు. ఇప్పుడు జగన్ కూడా తనను టార్గెట్ చేయడానికి మోదీ సాయం తీసుకుంటున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద జగన్ మోదీతో ఏం చెప్పారో? ఎవరికి తెలియకున్నా…. రాజకీయంగా మాత్రం కేసుల కోసమేనని, తనను వేధించడానికేనంటూ ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

Tags:    

Similar News