ఈ లెక్క కరెక్ట్ గా కుదిరితే ముప్పయ్యేళ్ళే ?

చదువుల బళ్ళో లెక్కలకు ఒక లెక్క ఉంది. రాజకీయ బళ్ళో కూడా ఆ లెక్కలదే పై చేయి. అన్ని లెక్కలూ పక్కాగా సరిపోతేనే అందలాలు దక్కేది, ఆనందాలు [more]

Update: 2021-01-01 15:30 GMT

చదువుల బళ్ళో లెక్కలకు ఒక లెక్క ఉంది. రాజకీయ బళ్ళో కూడా ఆ లెక్కలదే పై చేయి. అన్ని లెక్కలూ పక్కాగా సరిపోతేనే అందలాలు దక్కేది, ఆనందాలు చిక్కేది. ఇక రాజకీయ దురంధరులు అని పేరు పొందిన వారు సైతం ఇలా లెక్కల్లో ఫెయిల్ కావడం వల్లనే పీఠాలకు దూరం కావాల్సివస్తోంది. యువ నేతగా ఉన్న జగన్ మాత్రం పొలిటికల్ లెక్కల్లో బాగానే ఆరితేరిపోయారు అనే చెప్పాలి. ఆయన ఏపీ మొత్తం పాదయాత్రతో చుట్టేశారు. సోషల్ ఇంజనీరింగ్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. అటువంటి జగన్ కి పొలిటికల్ మేధమెటిక్స్ తెలియదు అంటే నమ్మే అమాయకులు ఉంటారా.

ట్రంప్ కార్డు అదే…..

జగన్ ఇప్పటిదాకా నగదు బదిలీ పధకాలనే పెద్ద ఎత్తున ఏపీలో అమలు చేశారు. వాటి వల్ల ఓట్లు రాలవా? అంటే పడతాయి కానీ పక్కా అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఖర్చు చేస్తే కరిగిపోయేది కరెన్సీ. అందుకే ఇపుడు శాశ్వతంగా జనం గుండెల్లో నిలిచిపోయే స్కీం కే జగన్ తెర తీశారు. అదే పక్కా ఇళ్ళ స్కీం. దీని వల్ల జగన్ సాధిస్తే పొలిటికల్ మైలేజ్ ఊహకు అందనంత ఎక్కువగా దక్కుతుంది అంటున్నారు. ఒక విధంగా జగన్ చేతిలో ఎప్పటికీ పదిలంగా ఉండే పొలిటికల్ ట్రంప్ కార్డు కూడా అదే అవుతుంది అంటున్నారు.

ఇదీ రాజకీయ గణితం…

ఏపీలో ముప్పయి లక్షల ఇళ్ళ పట్టాలను జగన్ పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారు. దశలవారీగా వాటిని నిర్మాణం కూడా చేపడుతున్నారు. మొత్తం ఈ తతంగం పూర్తి కావాలీ అంటే లక్ష కోట్ల నిధులు అవసరం. సరే దాని సంగతి పక్కన పెడితే జగన్ ఇళ్ళు ఇస్తున్నారు అన్నదే ఇక్కడ ముఖ్యమైన పాయింట్. ఇక ముప్పయి లక్షల ఇళ్ళనే బేరీజు వేస్తే ఒక్కో ఇంటిలో నలుగురు సభ్యులను వేసుకున్నా కూడా కచ్చితంగా కోటీ ఇరవై లక్షల మంది జనాభా ఉంటారు. అంటే అతి పెద్ద ఓటు బ్యాంక్ ఈ విధంగా జగన్ పరం కాబోతోంది. వీటిని దశలవారీగా పూర్తి చేసేటప్పటికి 2024 అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తి అవుతాయి. ఆ విధంగా జగన్ రెండో సారి సీఎం అయ్యేందుకు ఈ పక్కా ఇళ్ళ పధకం పక్కాగా ఆదుకుంటుంది అని చెప్పాల్సిందే.

ఇలా జరిగితే హిట్టే…?

ఇక ఈ పక్కా ఇళ్ళ జీవిత కాలం గరిష్టంగా ముప్ప్పయేళ్ళు అని అంచనా వేసుకున్నా అప్పటిదాకా జగన్ పేరు చెప్పుకుని ఆ గూటిలో ఉండే వారంతా వైసీపీనే నమ్ముకుంటారు. జగన్ కూడా వారి మద్దతుతో హ్యాపీగా రాజకీయ జీవితాన్నీ అలా మూడు దశాబ్దాలు కొనసాగించవచ్చు. ఎన్టీయార్ ఇప్పటికీ జనం గుండెల్లో దేవుడుగా నిలిచి పోయారూ అంటే దానికి కారణం పక్కా ఇళ్ళ నిర్మాణమే. అటువంటి కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపడుతున్న యువ ముఖ్యమంత్రి జగన్ ముప్పయ్యేళ్ళు నేనే సీఎం అన్న మాటను నిజం చేసేలాగే ఈ స్కీం ఉందని అంటున్నారు. మొత్తానికి అన్ని లెక్కలూ కుదిరిగే కనుక జగన్ కి ముప్పయ్యేళ్ళు ఎదురు లేని రాజకీయమే చేస్తారన్న విశ్లేషణలు అయితే ఉన్నాయి.

Tags:    

Similar News