అడ్వాంటేజీ ఉంటుందనేనా…?

జగన్ పదేళ్ల రాజకీయ జీవితంలో స్థిమితంగా ఉన్నది ముఖ్యమంత్రి అయిన తరువాతనే. ఆయన పదేళ్ల ప్రతిపక్ష పాత్ర అంతా జనం మధ్యనే గడచిపోయింది. ఒదార్పు యాత్రతో మొదలుపెట్టి [more]

Update: 2019-08-05 14:30 GMT

జగన్ పదేళ్ల రాజకీయ జీవితంలో స్థిమితంగా ఉన్నది ముఖ్యమంత్రి అయిన తరువాతనే. ఆయన పదేళ్ల ప్రతిపక్ష పాత్ర అంతా జనం మధ్యనే గడచిపోయింది. ఒదార్పు యాత్రతో మొదలుపెట్టి ప్రజా సంకల్ప యాత్ర వరకూ జగన్ ఏదో ఓ రూపంలో జనంలోనే ఉంటూ వచ్చారు. ఇక ఈ ఏడాది మార్చి, ఏప్రిల్లో ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన దూకుడుగా తిరిగారు. గత కొన్ని నెలలుగా మాత్రమే ఆయన అధికారిక బాధ్యతలతో జనానికి కాస్త ముఖం చూపించలేకపోతున్నారు. ఇపుడు ఆ లోటుని కూడా తీరుస్తానని యువ ముఖ్యమంత్రి అంటున్నారు. మళ్లీ జనంలోకి వస్తానని ఆయన చెబుతున్నారు. ఈసారి ముఖ్యమంత్రి హోదాలో జగన్ జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుడతారని అంటున్నారు.

రచ్చబండ పేరు మీద…..

వైఎఎస్ రాజశేఖర్ రెడ్డి రచ్చ బండ పేరు మీద జనంలోకి వెళ్ళాలనుకున్నారు. చివరికి ఆ కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశారు. జగన్ అదే కార్యక్రమాన్ని తాను పూర్తి చేయాలని భావిస్తున్నారు. దాంతో ఆయన కూడా రచ్చ బండ పేరిట జనంలో మమేకం కావడానికి ప్రొగ్రాం రెడీ చేసి పెట్టుకుంటున్నారుట. జిల్లాల పర్యటనలు చేస్తూ అక్కడ ప్రజలను కలుసుకుంటూ ప్రభుత్వం పధకాల తీరుతెన్నుల గురించి వారినే నేరుగా అడగాలన్నది జగన్ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. దీనివల్ల స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా ప్రజల్లో ఉన్న సమస్యలు నేరుగా తెలుసుకోవచ్చు, అదే సమయంలో వారికి మరింత దగ్గర కావడం ద్వారా పార్టీని కూడా పటిష్టం చేసుకోవచ్చునన్నది జగన్ ఎత్తుగడగా కనిపిస్తోంది.

సెంటిమెంట్ జిల్లాగా…..

జగన్ సెంటిమెంట్ జిల్లాగా శ్రీకాకుళాన్ని ఎంచుకుంటున్నారు. ఆయన పాదయాత్ర సైతం ఇదే జిల్లాలో ముగిసింది. ఇక తూర్పు ముఖంగా ఉన్న ఈ జిల్లా నుంచి ఏ పని తలపెట్టినా రాజకీయంగా కలసివస్తుందన్న సెంటిమెంట్ ఉంది. జగన్ సైతం దాన్ని అనుసరిస్తూ సిక్కోలు నుంచే జిల్లా పర్యటనలకు శ్రీకారం చుడతారని అంటున్నారు. ఆగస్ట్ నెల మొత్తం జగన్ బిజీగా ఉంటారు. ఆయన రెండు విదేశీ పర్యటనలు చేస్తారు. దాంతో తన తండ్రి వైఎస్సార్ వర్ధంతి రోజైన సెప్టెంబర్ 2 నుంచి జగన్ రచ్చ బండ పేరు మీద జిల్లాల టూర్లకు శ్రీకారం చుడతారని అంటున్నారు. ఓ వైపు ప్రతిపక్షాలు సైతం ఏదో ఒక రూపంలో జనంలోకి వెళ్లాలని చూస్తున్నాయి. వారి కంటే ముందుగానే జనంలోకి వెళ్తే అడ్వాంటేజ్ వుంటుందని జగన్ భావిస్తున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రెండు నెలల వ్యవధిలో జరుగుతాయని అంటున్నారు. వీటన్నిటికీ ఉపయోగపడేలా జగన్ జిల్లా టూర్లు ఉంటాయని వైసీపీ వర్గాలు తెలియచేస్తున్నాయి.

Tags:    

Similar News