ఆపరేషన్ విశాఖ… వారి పైన ఉక్కు పాదమే…?

విశాఖ మీద జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన ముఖ్యమంత్రిగా వస్తూనే ముందే అనుకున్న ప్రకారం విశాఖను పాలనా రాజధాని అన్నారు. దాంతో విశాఖలోని అణువణువునూ వైసీపీ [more]

Update: 2020-11-22 08:00 GMT

విశాఖ మీద జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన ముఖ్యమంత్రిగా వస్తూనే ముందే అనుకున్న ప్రకారం విశాఖను పాలనా రాజధాని అన్నారు. దాంతో విశాఖలోని అణువణువునూ వైసీపీ జల్లెడ పడుతోంది. టీడీపీ ఏలుబడిలో విశాఖను రెండవ అనధికార రాజధానిగా చేసుకుని ఒక సామాజికవర్గం సాగించిన గుత్త పెత్తనాన్ని బద్దలు కొట్టడమే ఇపుడు వైసీపీ ముందున్న కర్తవ్యం. దాంతో విజయసాయిరెడ్డి నాయకత్వంలో ఇది విజయవంతంగా సాగుతోంది. సెంటు జాగానుంచి వందల ఎకరాల వరకూ ఎక్కడ ఏ చిన్న కబ్జా ఎవరు చేసినా ఠక్కున గునపం దించేస్తోంది వైసీపీ.

వరసగా అలా ….

విశాఖలో దాదాపు నెల్లాళ్ళ క్రితం మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహారీ గోడను కూల్చేశారు అని పెద్ద యాగీనే చేసింది టీడీపీ. కానీ అది జస్ట్ శాంపిల్ అని తెలుసుకునేసరికే వైసీపీ ట్రాప్ లో నిండా టీడీపీ నేతలు పడిపోయారు. చంద్రబాబు నుంచి చినబాబు వరకూ అంతా ఇలా చేయడం న్యాయమా అంటూ నాడు దాడి చేశారు. అంతే ఆ తరువాత విశాఖ టీడీపీ మూల విరాట్టు లాంటి దివంగత ఎంవీవీఎస్ మూర్తి గీతం సంస్థల మీద అధికారులు పడ్డారు. ప్రస్తుతం అక్రమ కట్టడాల కూల్చివేత మీద కోర్టు స్టే ఇచ్చినా అసలు గీతం నిబంధలనలకు విరుద్ధంగా ఎలా వ్యవహరించిందో తెలియచేస్తూ విజయసాయిరెడ్డి ఏకంగా యూజీసీకే ఫిర్యాదు చేయడంతో కొత్త వివాదం అక్కడ రేగుతోంది.

చెలరేగిపోయారా…?

అయిదేళ్ళ టీడీపీ ఏలుబడిలో ఆ పార్టీ నాయకులు, ప్రత్యేకించి ఒక సామాజికవర్గానికి చెందిన నాయకులు ఇంతలా చెలరేగిపోయారా అన్న డౌట్లు ఇపుడు అందరిలో కలుగుతున్నాయి. తాజాగా ఉడా ఆఫీస్ కి ఎదురుగా ఉన్న ఒక ఫ్యూజన్స్ ఫుడ్స్ ని అక్రమంగా లీజుకు తీసుకుని మరీ అంతకు పదింతలకు ప్రైవేట్ గా అద్దెలకు తిప్పుతున్న ఒక తెలుగుదేశం నాయకుడి నుంచి దాన్ని వుడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2015 నుంచి 2024 వరకూ ఏకంగా తొమ్మిదేళ్ళ పాటు ఆ వుడా కట్టడం సదరు తెలుగుదేశం నాయకుడికి నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ లీజు ఇచ్చిన ఘనత నాటి టీడీపీ సర్కార్ దే. దాంతో దాన్ని తిరిగి వుడాకు స్వాధీనం చేస్తూ వైసీపీ చొరవతో అధికారులు కీలక‌ నిర్ణయం తీసుకున్నారు

ఆయనే ఈయన…?

ఇంతకీ ఆ నాయకుడు ఎవరూ అంటే 2018లో విశాఖ విమానాశ్రయంలో జగన్ మీద కోడి కత్తి దాడి చేసిన వెయిటర్ పనిచేసిన రెస్టారెంట్ ఓనరే ఇపుడు వుడా నుంచి అక్రమ లీజు పొందిన లీజుదారుడు హర్షవర్ధన్ చౌదరి అన్నమాట. ఈయన గాజువాకకు చెందిన నేత. అలాగే వలస వచ్చిన నేత. టీడీపీలో చంద్రబాబు, చినబాబులతో నేరుగా సంబంధాలు ఉన్న వారు కూడా. దాంతో గత కొన్నేళ్ళుగా ఉడా ఆద్వర్యంలోని ఫ్యూజన్స్ ఫుడ్స్ ని అక్రమంగా లీజును పొందినా ఎవరూ ఏమీ చేయలేదు. ఇక వైసీపీ విశాఖలో ఒక్కో అక్రమాన్ని వెలుగు తీస్తున్న వేళ ఈ అక్రమ లీజుకు కూడా మూడింది అంటున్నారు. ఈ కధ ఇంతటితో ఆగదుట. ఇంకా విశాఖలో ఎక్కడెక్కడ అక్రమాలు ఉన్నాయో చూసి మరీ సంగతి తేలుస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. మరి తమ్ముళ్ళ పక్షాన‌ చంద్రబాబు ముందుకు వస్తారా. లేక ప్రజల ఆస్తులకు న్యాయం జరుగుతోందని ఊరుకుంటారా.. చూడాలి మరి.

Tags:    

Similar News