వేట…. ఆట కోసమేనటగా?

చంద్రబాబు నిప్పు అని చెప్పుకుంటారు. ఆయన ఎంత చెప్పుకున్నా కూడా జనాలకు ఏది నమ్మాలో అదే నమ్ముతారు. జనాలకు బాబు మీద ఒక అవగాహన ఉంది. ఆయన [more]

Update: 2020-09-23 03:30 GMT

చంద్రబాబు నిప్పు అని చెప్పుకుంటారు. ఆయన ఎంత చెప్పుకున్నా కూడా జనాలకు ఏది నమ్మాలో అదే నమ్ముతారు. జనాలకు బాబు మీద ఒక అవగాహన ఉంది. ఆయన మంచి నేర్పరి అని భావిస్తారు. అందరి రాజకీయ నాయకుల మాదిరిగా చంద్రబాబు తప్పుకు ఇట్టే దొరకరు అని కూడా విశ్వసిస్తారు. సరిగ్గా ఈ పాయింట్ ని ఆధారం చేసుకునే జగన్ చంద్రబాబు మీద తనదైన రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబుని జనం ముందు నిలబెట్టి మీరే తేల్చుకోండి అంటున్నారు. బాబు అయిదేళ్ల పాలన మీద తీర్పు చెప్పిన ప్రజలకు అమరావతి రాజధాని భూముల కధను కూడా విప్పి చెప్పి మరీ జగన్ న్యాయం చెప్పమంటున్నారు.

అబద్ధమనుకోరుగా….?

అమరావతి రాజధాని కోసం వందల రోజుల పాటు ఆందోళన అక్కడ రైతులు చేశారు అని టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసింది. అయితే అమరావతి రాజధాని విషయంలో అక్కడ జనాలు తప్ప మిగిలిన వారు ఎవరూ గట్టిగా స్పందించలేరు. మద్దతు కూడా ఇవ్వలేదు. ఇది చాలు ఏపీ జనాల మౌన భావన ఎలా ఉందో చెప్పడానికి. అమరావతిలో లక్షల కోట్ల అవినీతి, భూ దందా జరిగిందని వైసీపీ చెప్పినా, అసలు ఏమీ జరగలేదు అని టీడీపీ వాదించినా నమ్మడానికి జనం సిద్ధంగా లేరు. వారి ఆలోచనలు వారికి ఉంటాయి. అందువల్ల అమరావతిలో కచ్చితంగా భూ దందా జరిగింది అన్నది జనం నిశ్చితాభిప్రాయంగా ఉందంటున్నారు.

ప్రజా కోర్టులోనే …..

దీంతో జనాభిప్రాయం పలు విధాలుగా తెలిసిన తరువాత జగన్ ఎందుకు ఊరుకుంటారు. అమరావతి కుంభకోణం మీద ఇంకా చెప్పాల్సింది చాలానే ఉందంటూ సీరియల్ కధగా వ్యవహారం నడుపుతూనే ఉంటారు. ఇది ఇలా సాగినంతకాలం చంద్రబాబు బదనాం అవుతూంటారు. అమరావతి విషయంలో ఎవరేమి భూములు కొన్నారో ఎంతెంత కొన్నారో వివరాలు ఇప్పటికే పలుమార్లు మీడియాలో వచ్చేశాయి. దాని మీద అగ్గి రాజుకుంటూనే ఉంది. వైసీపీ సర్కార్ కూడా దాన్ని వదిలిపెట్టేది లేదు. జనం కూడా దాన్ని ఎప్పటికపుడు గమనిస్తూనే ఉంటారు. అలా అసలైన న్యాయ స్థానం ప్రజా కోర్టులో చంద్రబాబుని దోషిగా నిలబెట్టాలన్నదే జగన్ చాణక్య నీతిగా చెబుతున్నారు.

శిక్ష అదేనట……

దీని మీద వైసీపీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ప్రజా కోర్టులో చంద్రబాబుకు ఇప్పటికే శిక్ష పడింది, తనకున్న అనుకూల వ్యవస్థల అండతో బాబు ఎప్పటికీ బయట ఉంటే ఉండొచ్చు కానీ ఆయన ఇపుడే అసలైన శిక్షను అనుభవిస్తున్నారు అంటూ నిప్పులే చెరుగుతున్నారు. చంద్రబాబు హైదరాబాద్ లో తన ఇంట్లో ఒక గదిలో ఒంటరిగా ఉండడం కంటే జైలు శిక్ష వేరేది ఉంటుందా అని కొడాలి నాని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు అసలైన శిక్ష వేసేది ఎపుడూ ప్రజలూ, దేవుడేనని, తాము వారినే నమ్ముకుని బాబు బండారం ఎప్పటికపుడు గుట్టు విప్పుతామని కూడా అంటున్నారు. మొత్తం మీద బాబు ఇప్పటికిపుడు జైలుకు వెళ్తాడని కానీ ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతాడు అని కానీ వైసీపీ పెద్దలకు కానీ జగన్ కి కానీ ఎటువంటి నమ్మకాలూ లేవట. జనంలో పెట్టి చంద్రబాబుని మరింతగా పరువు పలచన చేయడమే జగన్ మాస్టర్ ప్లాన్. అది తెలిసే బాబు కుములుతున్నారు అనుకోవాలేమో.

Tags:    

Similar News