మోడీ వస్తే విపక్షం చిత్తే ?

ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి జగన్ ల మధ్యన మంచి సంబంధాలే ఉన్నాయి. గతంలో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుని గెలిచినా కూడా మోడీకి, చంద్రబాబుకు మధ్య [more]

Update: 2020-08-11 03:30 GMT

ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి జగన్ ల మధ్యన మంచి సంబంధాలే ఉన్నాయి. గతంలో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుని గెలిచినా కూడా మోడీకి, చంద్రబాబుకు మధ్య ఎందుకో ఆ హెల్తీ రిలేషన్ షిప్ కనిపించేది కాదు, బాబు మోడీతో ఎపుడు భేటీ అయినా కూడా తన హడావుడి, ఆడంబరం, ప్రచార హోరుతో అప్పర్ హ్యాండ్ తనదేనని చెప్పుకునేందుకు ట్రై చేసేవారు. ఇది ప్రధాని ఆఫీస్ కనుసన్నల నుంచి దాటిపోయే వ్యవహరం కాదు కదా. అందుకే బాబు అతికి మోడీ ఎపుడు ముభావంగానే రెస్పాండ్ అయ్యేవారంటారు. కానీ జగన్ విషయంలో మోడీ కొంత స్నేహభావంతోనే ఉంటున్నట్లుగా గతంలో వేసిన భేటీలు చెబుతున్నాయి.

జగన్ పట్టుదల ….

ఇక మోడీని ఏపీకి రప్పించాలని జగన్ గట్టిగానే పట్టుబడుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా తాను చేయబోయే ప్రమాణ స్వీకారానికే మోడీని ముఖ్య అతిధిగా ఆహ్వాహించారు. అయితే అదే రోజున మోడీ కూడా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడంతో వీలు పడలేదు, ఇక గత ఏడాది అక్టోబర్లో మోడీ,వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రధాని చేతుల మీదుగానే ప్రారంభించాలని జగన్ అనుకున్నారు. కానీ మోడీకి అపుడూ వీలు పడలేదు, ఇపుడు 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ప్రధాని మోడీని రప్పించాలని జగన్ అనుకుంటున్నారు. అదే విధంగా విశాఖలో రాజధాని ప్రారంభానికి కూడా మోడీ రావ‌లని జగన్ పట్టుదలగా ఉందిట.

ఓకే అంటే…?

మోడీ ఒకే అంటే మాత్రం అది రాష్ట రాజకీయాల్లో పెను ప్రకంపనలకు అది దారి తీస్తుంది. ఓ వైపు అమరావతి రాజధాని కోసం టీడీపీ పట్టుపడుతోంది. దానికి కేంద్రం సాయం అడుగుతోంది.నీరు మట్టి ఇచ్చిన మోడీ శంఖుస్థాపన చేసిన మోడీ తానే మళ్లీ అమరావతికి ఊపిరి పోయాలని కూడా బాబు డిమాండ్ చేస్తున్నారు. ఆ ఎత్తుకు పై ఎత్తుగా అన్నట్లుగా విశాఖ రాజధానికి కూడా మోడీ చేతుల మీదుగానే శ్రీకారం చుట్టిస్తే ఇక టీడీపీ నోరు పూర్తిగా బంద్ అవుతుంది అని జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. అంతే కాదు, మొత్తం విపక్షం నోళ్ళు కట్టుబడతాయని అంచనా వేస్తున్నారు.

అదే విజయదశమి ….

సరిగ్గా అయిదేళ్ళు వెనక్కు వెళ్తే 2015 అక్టోబర్ 22 విజయదశమి వేళ అమరావతి రాజధానికి ప్రధాని మోడీ శంఖుస్థాపన చేశారు. కట్ చేస్తే ఈ 2020 అక్టోబర్ 25న విజయదశమి వేళ విశాఖలో పాలనారాజధానికి మోడీ శంఖుస్థాపన చేస్తారా. ఏమో రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. నిజానికి ఆగస్ట్ 16న జగన్ అనుకున్న ముహూర్తం. శ్రావణ మాసంలో మంచి రోజు అయినందున విశాఖలో రాజధానికి శుభశ్రీకారం చుట్టాలని భావించారు. అయితే దీని మీద హైకోర్టు స్టే ఉంది. సుప్రీం కోర్టులో స్టే వెకేట్ చేస్తే నో ప్రాబ్లెం, లేకపోతే మాత్రం విజయదశమేనట. చూడబోతే అదే నెల అదే దశమి జగన్ రాజధానికి కూడా ముహూర్తం అయ్యేట్లుంది.
.

Tags:    

Similar News