టార్గెట్ మోడీ నే … ఇది బాబు పనేనా …?

అమరావతి చూపు మోడీ వైపు. ఈ నినాదంతో అమరావతి శంఖుస్థాపన జరిగి ఐదేళ్లు అయిన సందర్భంగా ఆ ప్రాంత రైతులు ఆందోళన మొదలు పెట్టారు. అమరావతి లోనే [more]

Update: 2020-10-23 11:00 GMT

అమరావతి చూపు మోడీ వైపు. ఈ నినాదంతో అమరావతి శంఖుస్థాపన జరిగి ఐదేళ్లు అయిన సందర్భంగా ఆ ప్రాంత రైతులు ఆందోళన మొదలు పెట్టారు. అమరావతి లోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలన్న ఉద్యమం వెనుక టిడిపి ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అమరావతి లో రాజధాని నినాదానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మద్దతు కోసం అన్ని జిల్లాల ప్లకార్డు లతో తాజా ఉద్యమాన్ని రూపొందించారు వ్యూహకర్తలు. అంటే అందరు దీనికి మద్దతు పలుకుతున్నట్లు జాతీయ స్థాయిలో ప్రచారం కోసం ఆందోళన కారులకు ఇవి అందించారు. ఉద్యమం కలర్ ఫుల్ గా ఉండేందుకు డ్రెస్ కోడ్ కూడా పెట్టారు. కరోనా ప్రభావంతో బ్రేక్ పడిన ఉద్యమం ఈ మధ్య మళ్ళీ ఉపందుకునేలా కార్యాచరణ సాగుతుంది.

అంతా ప్రణాళికాబద్ధంగానే …

అమరావతి ఉద్యమాన్ని పెయిడ్ ఉద్యమం గా అధికారపార్టీ ఎప్పటినుంచో కొట్టిపారేస్తుంది. ఆ ఉద్యమం చేసేవారు అది నిజమే అన్న రీతిలో వ్యవహారం సాగుతుంది. ఇక జిల్లాల్లో చేపట్టే ఉద్యమాల్లో సైతం ప్రజలెవరు స్వచ్ఛందంగా పాల్గొనడం లేదు. కేవలం టిడిపి వర్గాలే పార్టీ ఆదేశాల మేరకు పాల్గొంటున్నాయి. ఇదంతా మీడియా లో ప్రచారం కోసం సాగుతున్న తంతుగానే నడుస్తుంది. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు ఉద్యమం కొత్త రూపు దాల్చుకోవడానికి వ్యూహకర్తలు రచన చేసినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

మోడీ ఎందుకంటే … ?

రాజధాని అమరావతి లో ఉండాలనే వాదన వైసిపి సర్కార్ పూర్తిగా పక్కన పెట్టేసింది. మద్దతు కోసం కేంద్రంపై వత్తిడి తెద్దామనుకుంటే ఈ వ్యవహారంలో మాకు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వమే తేల్చుకోవాలని కేంద్రం కోర్ట్ లో రెండు సార్లు అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో రాజకీయ లాబీయింగ్ తోనే విజయం సాధించడం లేదా బిజెపి ని ఇరుకున పెట్టడమే టార్గెట్ గా ఉద్యమ కారులు ముందుకు అడుగులు వేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తుంది.

రెండు రకాలుగా…..

అమరావతి చూపు మోడీ వైపు అనే నినాదం వెనుక పెద్ద వ్యూహమే దాగివుందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తే తప్ప ఈ ఉద్యమానికి ఊపు రాదన్న ధోరణి రెండు రకాలుగా టిడిపి కి కలిసి వస్తుందని వ్యూహకర్తల ఆలోచన ఉందంటున్నారు. అమరావతి నుంచి రాజధాని కదిలితే ఆ పాపంలో బిజెపి ని దోషిగా చేయడం, ఫలితంగా టిడిపి ఒక్కటే రెండు జిల్లాల్లో అడ్వాంటేజ్ తీసుకోవాలని ఆలోచన చేస్తుందంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ పరిణామాలను రాజకీయ ఢక్కా మొక్కీలు తిన్న మోడీ కి ఒక లెక్కా అన్న టాక్ కూడా బలంగానే వినిపిస్తుంది. భవిష్యత్తులో ఏమి జరగనుందో చూడాలి.

Tags:    

Similar News