తెలుగుదేశం నశించాలి అంటున్న జేసీ ?

ఆయనంత ముదురు నాయకుడు ఏపీ రాజకీయాల్లో ఉండరేమో. వయసుతో పాటు కావాల్సినంత రాజకీయ సీనియారిటీ ఆయనకు ఉంది. ఆయన మాట అంటే బాబు సైతం భయపడతారు. అటువంటి [more]

Update: 2020-01-06 13:30 GMT

ఆయనంత ముదురు నాయకుడు ఏపీ రాజకీయాల్లో ఉండరేమో. వయసుతో పాటు కావాల్సినంత రాజకీయ సీనియారిటీ ఆయనకు ఉంది. ఆయన మాట అంటే బాబు సైతం భయపడతారు. అటువంటి జేసీ దివాకర రెడ్డి ఇపుడు కొత్త రూట్లో వెళ్తున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్న టీడీపీలో పరిస్థితి బాలేదు. పోలీసులు కూడా కనీసం లెక్కచేయడంలేదు. వైసీపీలోకి పోదామన్నా కుదిరే కధ కాదు, అసలు గొడవ అంతా ఆ పార్టీతోనే కదా. దాంతో జాతీయ పల్లవిని అందుకుంటున్నారీ పెద్దాయన. జాతీయానికే నా ఓటు. ప్రాంతీయ పార్టీలు ఇక చెల్లు అంటూ కొత్తగా నినదిస్తున్నారు.

పీడ పోవాలట :

ప్రాంతీయ పార్టీలు దేశానికి పట్టిన పెద్ద పీడ అంటున్నారు జేసీ. దేశంలో ఎగరాల్సింది జాతీయ పార్టీ జెండా తప్ప మ‌రొకటి కానే కాదని అని కూడా తేల్చేస్తున్నారు. జమిలి ఎన్నికలు పెడితే ప్రాంతీయ పార్టీల పీడ విరగడైపోతుందని శాపనార్ధాలు పెట్టేశారు. తానున్నది ఒక ప్రాంతీయ పార్టీయే కదా అని మీడియా గుర్తు చేస్తే ఈ పీడ కూడా విరగడైపోతే మంచిదేగా అంటున్నారట. మొత్తానికి ఉన్న పార్టీని కూడా పీడగా, చీడగా భావించడం జేసీ లాంటి వారికే చెల్లిందని అంటున్నారు.

మొట్టికాయలు లేకట :

ఎందుకు ప్రాంతీయ పార్టీలంటే వెగటు జేసీ గారూ అంటే ప్రాంతీయ పార్టీల నేతలకు పై నుంచి మొట్టి కాయలు పడవట. వారే అధినేతలు కాట్టి వారు కోరుకున్నట్లుగా వ్యవహారాలు నడుపుతూ అంతా ఏకపక్షం చేస్తున్నారని జేసీ అంటున్నారు. అదే జాతీయ పార్టీల్లో అయితే హై కమాండ్ అని ఒకటి ఉంటుందని, అది మాటిమాటికీ మొట్టి కాయలు వేస్తుందని అంటున్నారు. దాని వల్ల దారిన పడతారని, తప్పులు జరిగే అవకాశాలు ఉండవని తనదైన విశ్లేషణ కూడా చేస్తున్నారు.

రూట్ క్లియరేనా :

ఇన్ని మాటలు చెబుతున్న జేసీ రాజకీయ అతి తెలివి చూపిస్తున్నారని అంటున్నారు. ఆయన బీజేపీని పొగడడం వెనక పెద్ద కధే ఉందని అంటున్నారు. తనకు తానుగా చేరకుండా బీజేపీని కీర్తిస్తూ ఉంటే తనకు మంచి ఆహ్వానం వస్తుందని, ఆనక రాచమర్యాదలతో కాషాయ కండువా కప్పుకోవచ్చునని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి లాంటి వారితో రాసుకుపూసుకు తిరిగుతున్న జేసీ తొందరలో పసుపు జెండా పీకేయడం ఖాయమన్న మాట సీమ జిల్లాల్లో గట్టిగా వినిపిస్తోంది

Tags:    

Similar News