రజనీ రెడీ అవుతున్నారా?

రజనీకాంత్ రాజకీయ పార్టీ ప్రకటన చేయనున్నారా? తమిళనాడు ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రజనీకాంత్ తన పార్టీని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో రజనీకాంత్ పార్టీ కోసం [more]

Update: 2020-09-24 17:30 GMT

రజనీకాంత్ రాజకీయ పార్టీ ప్రకటన చేయనున్నారా? తమిళనాడు ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రజనీకాంత్ తన పార్టీని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో రజనీకాంత్ పార్టీ కోసం అన్ని రాజకీయ పార్టీలూ ఎదురు చూస్తున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే కూటమిలోని పార్టీలు సయితం రజనీకాంత్ పార్టీని ప్రకటిస్తే అందులో చేరిపోవడానికి సిద్ధమయ్యాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఎంతో కాలం లేకపోవడంతో రజనీకాంత్ ప్రకటన కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

నవంబరు నెలలో…..

అయితే రజనీకాంత్ రాజకీయ ప్రకటన త్వరలోనే చేయనున్నారని తెలిసింది. వచ్చే నవంబరు నెలలో రజనీకాంత్ రాజకీయ పార్టీని ప్రకటిస్తారని తమిళనాడులో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇందుకోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నవంబరు నెలలో పార్టీని ప్రకటించి రజనీకాంత్ జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పార్టీ ప్రకటనతో పాటు పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను కూడా రజనీకాంత్ ఈ సందర్భంగా వివరించనున్నారు.

మూడేళ్లు దాటుతున్నా….

రజనీకాంత్ రాజకీయ పార్టీని ప్రకటిస్తానని 2017 డిసెంబరులో ప్రకటించారు. అప్పటి నుంచి రజనీకాంత్ నోటి నుంచి పార్టీ ప్రకటన వెలువడలేదు. రేపు, మాపు అంటూ ఊహాగానాలయితే విన్పిస్తున్నాయి తప్ప ఆయన నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో తలైవా అభిమానులు నిరాశలో ఉన్నారు. తమిళనాడులో ఉన్న రాజకీయ శూన్యతను రజనీకాంత్ తన పరం చేసుకుంటారని విశ్లేషణలు కూడా వెలువడుతున్న నేపథ్యంలో ఆయన నవంబరులో పార్టీని ప్రకటిస్తారని చెబుతుండటం అభిమానులకు ఊరట కల్గించే అంశమే.

పోటీకి రెడీ….

ఇప్పటికే రజనీ మక్కల్ మండ్రం పేరుతో సభ్యత్వాలను చేర్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా స్థాయి నేతలకు బాధ్యతలను అప్పగించారు. రజనీకాంత్ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఆయన నాలుగు నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. మధురై, తిరువణ్ణామలై, వేలూరు, షోలింగర్ నియోజకవర్గాల్లో ఏదో ఒకదానిని రజనీకాంత్ ఎంచుకునే అవకాశాలున్నాయి. వీటిలో ఇప్పటికే మక్కల్ మండ్ర సర్వే కూడా చేపట్టిందంటున్నారు. మొత్తం మీద నవంబరు నెలలోనైనా రజనీకాంత్ పార్టీ ప్రకటన ఉంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News