ఇంతకీ ఆ కానుక ఎవరికి ?

రాజకీయాల్లో మాటలు ఒక్కోసారి కోటలు దాటుతూంటాయి. ప్రత్యర్ధి ప్రార్టీలను టార్గెట్ చేయడానికి సౌండ్ పెంచుతారు. అందులో నిజాలు ఎంత అన్నది తరువాత జనాలు నిర్ణయిస్తారు. ఇక విశాఖ [more]

Update: 2020-10-03 02:00 GMT

రాజకీయాల్లో మాటలు ఒక్కోసారి కోటలు దాటుతూంటాయి. ప్రత్యర్ధి ప్రార్టీలను టార్గెట్ చేయడానికి సౌండ్ పెంచుతారు. అందులో నిజాలు ఎంత అన్నది తరువాత జనాలు నిర్ణయిస్తారు. ఇక విశాఖ రాజకీయం గత ఏడాదిగా వేడెక్కుతూనే ఉంది. విశాఖను పరిపాలనా రాజధాని అని జగన్ అసెంబ్లీలో ప్రకటించిన తరువాత అనుకూలంగా వైసీపీ నేతలు గట్టిగా మాట్లాడుతున్నారు. సైలెంట్ గా విశాఖ‌ టీడీపీ ఉండడాన్ని చూసి అంగీకారం అని అంటున్నారు. అయితే టీడీపీ అధినాయకత్వం గొంతు వేరుగా ఉంటోంది. అమరావతే మన రాజధాని కావాలి అన్నది బాబు పర్మనెంట్ డిమాండ్. దాన్ని భరించలేక అక్కడ వత్తిడిని తట్టుకోలేక టీడీపీని వీడానని వాసుపల్లి గణేష్ కుమార్ తాజాగా చెప్పారు.

మేయర్ సీటుపై …

నిజానికి విశాఖ సిటీలో వైసీపీకి బలం పెద్దగా లేదు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ సిటీలో ఉన్న నాలుగు సీట్లూ టీడీపీకి కోల్పోయింది. ఇక అందులో నుంచి మొదటి వికెట్ పడింది. సౌత్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ జై జగన్ అనేశారు. ఆయన ఫ్యాన్ నీడకు చేరుతూనే మేయర్ సీటు ని సాధించి జగన్ కి కానుకగా ఇస్తామని చెప్పారు. విశాఖ అంతా వైసీపీ వెంటే ఉందని కూడా ఆయన బల్ల గుద్దుతున్నారు. టీడీపీకి ఫ్యూచర్ లేదని కూడా జాతకం చెప్పేశారు.

బాబుకేనట…

మరి టీడీపీ తమ్ముళ్లు దీనికి ఊరుకుంటారా. పైగా అక్కడ ఉన్నది మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. సవాళ్ళకు తొడగొట్టడాలకు పెట్టింది పేరు. అందుకే ఆయన విశాఖ మేయర్ సీటు టీడీపీదే. అది ఎపుడో కన్ ఫర్మ్ అయిపోయింది. మీరు ముందు ఎన్నికలు పెట్టించండి, ఎవరు విజేతో కళ్లకు కట్టినట్లుగా చూపిస్తాం. ఎంతమంది టీడీపీని వీడినా కూడా మాకేం కాదు, విశాఖ జనం ఎపుడూ సైకిల్ పార్టీ వైపే. మేయర్ సీటు కూడా మాదే. దాన్ని గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తామని అయ్యన్న ఓ రేంజిలో గర్జిస్తున్నారు.

అదే డౌట్ ….

విశాఖలో టీడీపీకి బలం ఉందన్నది నిజం. అయితే విశాఖ రాజధాని ప్రకటన తరువాత అది తగ్గిందా లేదా అన్నది ఒక డౌట్. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నా కూడా ఒక్క వెలగపూడి రామక్రిష్ణ బాబు తప్ప మిగిలిన వారు సైలెంట్. ఇపుడు వాసుపల్లి బయటకు వచ్చాక సిటీలో వైసీపీ రీసౌండ్ చేస్తోంది. అయితే వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయి. అప్పటికి జగన్ సర్కార్ మీద యాంటీ ఇంకెబెన్సీ ఎంతమేరకు పెరుగుతుంది అన్నది మరో డౌట్. ఇక టీడీపీ ఏ మాత్రం పుంజుకున్నా లోకల్ బాడీ ఎన్నికల్లో ఫలితాలు తేడా కొడతాయి. లేక ఇంకా చతికిలపడితే వార్ వన్ సైడ్ అవుతుంది. ఏది ఏమైనా జనాల చేతిలో అసలు జాతకాలు ఉన్నాయి. దాన్ని మరచి తామేదో విశాఖ‌ను గుత్తకు కొన్నట్లుగా కానుకలు చేత పట్టి అధినేతలకు ఇస్తామని రెండు పార్టీల వైపు నుంచి చెప్పుకోవడం, సవాళ్ళు చేసుకోవడమే అసలైన రాజకీయంగా ఉందని అంటున్నారు.

Tags:    

Similar News