దేశం చేతులెత్తేసింది… ఎవరి ప్రాణాలు వారే?

భారత్ కరోనా నుంచి బయట పడటం కష్టమే. ఎందుకంటే రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇది దేశ వ్యాప్తంగా ఆందోళన కల్గిస్తుంది. లాక్ డౌన్ [more]

Update: 2020-06-29 18:29 GMT

భారత్ కరోనా నుంచి బయట పడటం కష్టమే. ఎందుకంటే రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇది దేశ వ్యాప్తంగా ఆందోళన కల్గిస్తుంది. లాక్ డౌన్ అమలు చేసినంతవరకూ కంట్రోల్ లో ఉన్న కరోనా మినహాయింపుల తర్వాత కేసుల సంఖ్య ఆగడం లేదు. రోజుకు పదిహేను వేలు నుంచి పదిహేడు వేల వరకూ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఇప్పటికే దేశ వ్యాప్తంగా పదహారువేలు దాటింది.

కట్టడి చేయడంలో ప్రశంసలు….

కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో భారత్ విజయవంతమయిందని తొలినాళ్లలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అంతర్జాతీయ మీడియా సయితం ప్రశంసలు కురిపించింది. లాక్ డౌన్ నుంచి ఎలా ఎగ్జిట్ అవుతారోనని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూసింది. అయితే మూడో విడత లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తూ ప్రధాని మోదీ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నాన్ని మొదలు పెట్టారు.

మినహాయింపుల తర్వాత…..

కానీ లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత కేసుల సంఖ్య మరిన్ని పెరుగుతున్నాయి. ఇప్పటికే భారత్ లో ఐదు లక్షల కరోనా పాజటివ్ కేసులు దాటాయి. దీనికి కారణం ప్రభుత్వాల వైఖరి ఒక కారణంకాగా, ప్రజల అజాగ్రత్త కూడా మరో కారణమని చెప్పక తప్పదు. కరోనా విజృంభిస్తున్నా ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడం, మాస్క్ లు ధరించకపోవడం వంటి వాటి వల్ల కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి.

రానున్న రోజుల్లో…..

అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశం లేదు. ఎక్కడిక్కడ కేసుల సంఖ్యను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలే లాక్ డౌన్ నిర్ణయాలు తీసుకోవాలని చెబుతోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ను విధించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముందని చెబుతోంది. భారత్ లో కూడా కేసుల సంఖ్య పదిహేను లక్షలు దాటుతాయన్న లెక్కలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం చేతులెత్తేసింది. ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు దేశంలో ఉంది.

Tags:    

Similar News