లింకులు కలుస్తున్నాయ్.. అసలు నిందితుడెవరో?

మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడుతుందా? రెండేళ్ల నుంచి అసలు హత్యకు గల కారణం? నిందితులెవరో తేల్చలేకపోవడం [more]

Update: 2021-06-26 03:30 GMT

మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడుతుందా? రెండేళ్ల నుంచి అసలు హత్యకు గల కారణం? నిందితులెవరో తేల్చలేకపోవడం పట్ల విచారణ సంస్థల పనితీరుపైనే అనుమానం కలుగుతుంది. కొద్దోగోప్పో మనదేశంలో సీబీఐ పై నమ్మకం ఉంది. గత కొద్ది రోజులుగా సీబీఐ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికైనా హత్యకు కారణాలు, అసలు నిందితులెవరో తేలుతుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

రెండేళ్ల నుంచి…..

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ నేత. రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న నేత. ఒక ప్రముఖ రాజకీయ కుటుంబం నేపథ్యమున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి హత్యకు గురయితే ఇంతవరకూ నిందితులెవరో తేల్చలేకపోవడం మన విచారణ సంస్థల పనితీరుకు నిదర్శనమనే చెప్పాలి. ఈ హత్య విషయంలో తేల్చలేకపోతే ఇక సామన్యులు హత్యకు గురైతే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి రెండేళ్లు కావస్తుంది.

విచారణ సంస్థలపైనే…?

హత్యకు గురయినప్పుడు ఉన్న ప్రభుత్వం, ఆతర్వాత వచ్చిన ప్రభుత్వం రెండు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం లను ఏర్పాటు చేశాయి. కానీ అవి ఏమీ తేల్చలేకపోయాయి. ఇప్పుడు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ విచారణలో కొత్త కొత్త వ్యక్తుల పేర్లు బయటకు వస్తున్నాయి. వివేకా అనుచరుడు గంగిరెడ్డి దగ్గర నుంచి ఆయన డ్రైవర్ దస్తగిరి వరకూ మరోసారి విచారించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యే ముందు నెల రోజుల ఫోన్ కాల్స్ ఆధారంగా విచారించారు.

స్పష్టత వచ్చిందా?

ఈ కేసులో కొత్త పేర్లు వస్తుండటంతో విచారణ ముగింపుదశకు చేరుకుంటుందంటున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి జరిపిన ఆర్థిక లావాదేవీలు, సెటిల్ మెంట్ల వంటివి కూడా సీబీఐ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. బెంగళూరులోని భూ వివాదాల విషయంపై కూడా ఆరాతీశారు. అయితే ఇప్పడిప్పుడే సీబీఐ అధికారులు వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఒక కన్ క్లూజన్ రాకపోయినా కీలక ఆధారాలు మాత్రం లభించినట్లు తెలిసింది. త్వరలోనే హత్యకు గల కారణాలు, నిందితులెవరో సీబీఐ తేలుస్తుందని ఆశిద్దాం.

Tags:    

Similar News