అన్ని రకాలుగా అడుగడుగునా అడ్డుకుంటున్నారే?

భారత్ కు చికాకులు, చిక్కులు కల్పించడం చైనా విధానంగా మారింది. గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ మరింత ఊపందుకుంది. సరిహద్దుల్లో, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై భారత్ ను [more]

Update: 2021-02-17 16:30 GMT

భారత్ కు చికాకులు, చిక్కులు కల్పించడం చైనా విధానంగా మారింది. గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ మరింత ఊపందుకుంది. సరిహద్దుల్లో, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై భారత్ ను ఇరుకున పెటట్డం, ఇబ్బంది పెట్టడం ఇటీవల కాలంలో మరింత ఎక్కువైంది. గతఏడాది మార్చి నుంచి తూర్పు లడ్డాఖ్ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ (ఎల్ ఏ సీ- లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్) వద్ద ఉద్రిక్తతలకు ఊపిరిపోస్తోంది. ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. పైకి చెప్పనప్పటికీ బీజింగ్ కూ భారీ నష్టమే వాటిల్లింది. ఇప్పటికీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారలేదు.

అంతర్జాతీయ వేదికలపైనా…

అంతర్జాతీయ వేదికలపైనా భారత్ ను అడ్డుకోవడం చైనాకు అలవాటుగా మారింది. ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి భారత్ కు వ్యతిరేకంగాపావులు కదిపి తన కుత్సితాన్ని చాటుకుంది. ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాపై ఆంక్షలను విధించే కమిటీకి భారత్ నాయకత్వం వహించడాన్ని బీజింగ్ అడ్డుకుంది. ఈనెల 12న జరిగిన మండలి సమావేశంలో అయిదు శాశ్వత సభ్యత్వ దేశాల్లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా కమిటీకి భారత్ సారథ్యం వహించడానికి అంగీకరించాయి. అయితే చైనా తన వ్యతిరేకత (వీటో)ను వ్యక్తం చేయడం ద్వారా భారత్ ను అడ్డుకుంది. మండలి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అయిదు శాశ్వత సభ్యత్వ దేశాలు అంగకరించాల్సిందే. ఏ ఒక్క దేశం సమ్మతించకపోయినా ఆ నిర్ణయం అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు చైనా అడ్డుకోవడం ద్వారా భారత్ కు వచ్చిన అవకాశాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంది. ఆంక్షల కమిటీకి భారత్ నాయకత్వం వహిస్తే ఉగ్రవద సంస్థపై ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటుందోనన్న అనుమానమే చైనా నిర్ణయానికి అసలు కారణం.

భారత్ కు వ్యతిరేకంగా…..

తన అనుంగు మిత్రదేశమైన పాకిస్థాన్ భారత్ కు వ్యతిరేకంగా ఈ ఉగ్రవాద తండాలకు నారూనీరూ పోస్తున్న సంగతి తెలిసిందే. భారత్ కు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికలపై పావులు కదపడం బీజింగ్ కు కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలానే వ్యవహరించింది. అజహర్ మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంలో భారత్ ప్రయత్నాలకు నాలుగుసార్లు అడ్డుపడింది. భారత్ లో జరిగిన అనేక విధ్వంస ఘటనలకుఅజహర్ మసూద్ సూత్రధారన్న సంగతి తెలిసిందే. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు మసూద్ అధిపతి. ఆంక్షల కమిటీకి నాయకత్వం వహించకుండాభారత్ ను అడ్డుకోవడం ద్వారా ఆ అవకాశం నార్వేకి లభించింది. తాలిబన్లపై ఆంక్షల కమిటీకి సారథ్యం వహించే అవకాశం మాత్రమే ఇప్పుడు భారత్ కు మిగిలింది. ఇప్పుడు కాకపోయినా వచ్చే ఏడాదైనా భారత్ కు అవకాశం వస్తుందని దౌత్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

శాశ్వత సభ్యత్వం కోసం….

భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ ప్రయత్నాలను చైనా పలుమార్లు అడ్డుకుని తన కుటిలత్వాన్ని చాటుకుంది. మిగిలిన నాలుగు శాశ్వత సభ్యత్వ దేశాలైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ ఎప్పుడో సుముఖుత చూపాయి. చైనా సమ్మతి లేనందునే ఇప్పటికీ శాశ్వత సభ్యత్వం భారత్ కు అందని ద్రాక్షగా మిగిలిపోయింది. నిజానికి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా, అతి పెద్ద జనాబా గల దేశంగా శాశ్వత సభ్యత్వం భారత్ హక్కు. స్వతంత్ర న్యాయవ్యవస్థ, మైనార్టీల హక్కుల పరిరక్షణ, క్రమం తప్పని ఎన్నికలు, పేదల అభ్యున్నతికి కట్టుబడిన దేశంగా అంతర్జాతీయంగా ఎలాంటి గౌరవం, హోదాకు అన్నివిధాలా అర్హురాలు. తన కుటిల యత్నాల ద్వారా తాత్కలికంగా అడ్డుకున్నప్పటికీ భవిష్యత్తులో భారత్ ను అడ్డుకోవడం అసాధ్యమన్న విషయాన్ని చైనా ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News