బాబు హాజరుపట్టీ చూసుకుంటున్నారట

చంద్రబాబు అంటే చండశాస‌నుడు. ఆయన చెప్పిందే వేదం, అనుకున్నదే శాస‌నం. బాబు ఏం చెబితే అదే రైట్. అటు అధికారులకైనా, ఇటు పార్టీ నేతలకైనా బాబు మాటే [more]

Update: 2019-06-29 06:30 GMT

చంద్రబాబు అంటే చండశాస‌నుడు. ఆయన చెప్పిందే వేదం, అనుకున్నదే శాస‌నం. బాబు ఏం చెబితే అదే రైట్. అటు అధికారులకైనా, ఇటు పార్టీ నేతలకైనా బాబు మాటే మంత్రం. ఇది ఎప్పుడు అంటే మే 23 వరకు, ఫలితాలు వచ్చాక బాబు పరిస్థితి రివర్స్ అయింది. ఇప్పుడు ఎటూ అధికారులతో బాబు మీటింగులు పెట్టలేరు. పోనీ పార్టీ నాయకులతో సమావేశాలు పెడతామంటే ఏరీ ఎవరూ కనిపించడంలా. ఒకప్పుడు బాబు కను చూపు కోసం కలవరించిన నాయకులే ఇప్పుడు బాబు గాలానికి చిక్కకుండా తప్పించుకుంటున్నారు. ఇదంతా అధికార మహత్యం. ఇపుడు బాబు దగ్గర పవర్ లేదు. అందుకే ఈగలు కూడా వాలడంలేదు. చంద్రబాబు మొత్తం రాజకీయ కెరీర్లో ప్రస్తుత రోజులు చాలా భిన్నమైనే చెప్పాలి. బాబుకు అధికారం లేకపోవడం కొత్త కాదు కానీ ఈ రకమైన దయనీయ స్థితి అదీ సొంత పార్టీ నుంచే ఎదురు కావడం మాత్రం బాధాకరమే.

లెక్కబెట్టుకోవాల్సివస్తోంది :

ఇక పార్టీ నేతలను బాబు ఒకటికి పదిమార్లు లెక్కపెట్టుకోవాల్సివస్తోంది. అసలు ఎవరు పార్టీలో ఉన్నారు. ఎవరు బయటకు పోతున్నారు అన్నది అసలు అర్ధం కావడం లేదుట. పార్టీ మీటింగ్ ఉందని చెబితే నాయకులకు చాలా చులకన అయిపోయింది. ఫలానా సమయానికి మీటింగ్ అన్నా ఎవరూ ఖాతరు చేయడంలేదు. ఫోన్లకు దొరకరు, ఎక్కడ ఉన్నారో చెప్పరు, దీంతో చంద్రబాబు లో టెన్షన్ పెరిగిపోతోంది. ఓ వైపు బీజేపీ గాలం వేస్తోంది. అపుడే నలుగురు ఎంపీలను తీసుకున్న కమలానికి ఆకలి తీరడం లేదు. ఎమ్మెల్యేల వైపు, పార్టీలో బలమైన నేతల వైపు చూపు సారించి ఎక్కడికక్కడ ఏరివేయాలనుకుంటోంది. దాంతో పార్టీ నాయకులతో బాబు ప్రతీ రోజూ మీటింగులు పెడుతున్నారు. కానీ బాబుకు నిరాశే. ఎందుకంటే ఆయన ముందు హాజరయ్యే వారి శాతం రోజురోజుకూ తగ్గిపోతోంది.

బతిమాలుకోవడాలట‌ :

వింత ఏంటి అంటే ఒకనాడు చంద్రబాబు దర్శనం కోసం పడిగాపులు పడ్డ నేతలకు ఈ రోజు స్వయంగా బాబు ఫోన్లు చేసి రమ్మని పిలవడం. అలక పానుపు ఎక్కిన వారిని బతిమాలుకోవడం. ఇక కొందరు నేతలైతే ఎటువంటి మొహమాటాలూ లేకుండా బాబు ఎదుటనే తమ అసంత్రుప్తి వెళ్ళగక్కుతున్నారు. తమను చేసిన అన్యాయాన్ని ఏకరువు పెడుతున్నారు. అధికారం లేదు బాబు మాత్రం ఏం చేయగలరు, ఇక మీదట బాగా చూసుకుంటానని బుజ్జగిస్తున్నారు. ఒక నాయకుడు అయితే సీనియర్ ఏమీ కాదు ఒక సారి మాత్రమే గెలిచాడు. అయితే బలమైన కాపు వర్గం నేత. ఈసారి ఎన్నికల్లో ఓడిపోయిన ఆ నేత సైతం బాబును బెదిరించే స్థాయికి ఎదిగిపోయాడంటే ఏంటో అర్ధమవుతోంది. అంతా అధికారమయం.

Tags:    

Similar News