ఎటూ తేల్చుకోలేకపోతున్నారా?

కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఇప్పుడు ఆ పార్టీ ముందు రెండు ప్రధాన సమస్యలున్నాయి. ఒకటి కేసీఆర్ ను దెబ్బతీయడం, రెండు బీజేపీ ని ఎదగకుండా నిలువరించడం. [more]

Update: 2021-01-22 09:30 GMT

కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఇప్పుడు ఆ పార్టీ ముందు రెండు ప్రధాన సమస్యలున్నాయి. ఒకటి కేసీఆర్ ను దెబ్బతీయడం, రెండు బీజేపీ ని ఎదగకుండా నిలువరించడం. ఈ రెండు లక్ష్యాలు చేరుకోవడం కాంగ్రెస్ కు అంత సులువు కాదు. ఎందుకంటే కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు ఎక్కువ. ఇప్పటికే పీసీసీ చీఫ్ విషయంలో అనేక గ్రూపులుగా విడిపోయి పార్టీని బజారున పడేశారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కోసం ఏకంగా పీసీసీ చీఫ్ ఎంపికనే వాయిదా వేశారు.

పోటీ ఎక్కువ కావడంతో….

ఇక మరికొద్ది రోజుల్లో తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. కొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎక్కువయ్యారు. ఈ పంచాయతీ తేలకుండా ఉంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో…..

నిజానికి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానానికి ప్రొఫొసెర్ కోదండరామ్ కు కాంగ్రెస్ మద్దతివ్వాల్సి ఉంది. గత ఎన్నికల్లో సయితం కోదండరామ్ తన సీటును కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్యయ్య కోసం త్యాగం చేశారు. ఆయన బరిలోకి దిగుతానని ప్రకటించారు. అయితే కోదండరామ్ ను వ్యతిరేకిస్తున్న ఒక వర్గం కాంగ్రెస్ లో తయారయింది. ఒక వర్గం కోదండరామ్ కు మద్దతివ్వడమే బెటరని చెబుతోంది.

కోదండరామ్ కు మద్దతిచ్చేందుకు….

ప్రధానంగా బీసీ వర్గం నేతలు కోదండరామ్ కు మద్దతిచ్చేందుకు అంగీకరించడం లేదు. కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉంటేనే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందంటున్నారు. అలా కాకుండా ఇతర పార్టీలకు మద్దతిచ్చుకుంటూ వెళితే కాంగ్రెస్ నేతలు, క్యాడర్ డీలా పడుతుందని చెబుతన్నారు. ఇలా కాంగ్రెస్ టీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కొనే ముందు సొంత పార్టీలో ివిభేదాలనే తొలుత పరిష్కరించుకోవాల్సి ఉంది. లేకుంటే కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమంటున్నారు.

Tags:    

Similar News