కాంగ్రెస్ లో మిగిలేది ఎవరు?

వరస ఓటములతో తల్లడిల్లిపోతున్న కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లో ఇబ్బందులు తప్పేట్లు లేవు. నాయకత్వ సమస్యతో పాటు పార్టీకి ఇక భవిష్యత్ లేదని భావించిన నేతలు పార్టీకి [more]

Update: 2020-12-03 09:30 GMT

వరస ఓటములతో తల్లడిల్లిపోతున్న కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లో ఇబ్బందులు తప్పేట్లు లేవు. నాయకత్వ సమస్యతో పాటు పార్టీకి ఇక భవిష్యత్ లేదని భావించిన నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారు. రానున్న ఎన్నికల సమయానికి కాంగ్రెస్ సీనియర్ నేతల్లో అనేక మంది పార్టీని వీడే అవకాశముంది. కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం తర్వాత వలసలు మరింతగా పెరిగే అవకాశముందన్న అంచనాలు విన్పిస్తున్నాయి.

నాయకత్వంపై నమ్మకం లేకనే….

కాంగ్రెస్ నేతలు ఇప్పటికే పార్టీని వీడిపోయారు. డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి వంటి నేతలు పార్టీని వీడారు. ఇక దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నమ్మకం కోల్పోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డిని అట్టర్ ఫెయిల్యూర్ చీఫ్ గా చెప్పుకోవాలి. ఆయన జమానాలో వచ్చిన ఎన్నికల్లో అన్నీ పరాజయాలే మూటగట్టుకున్నాయి. కొత్త అధ్యక్షుడి ఎంపిక ఇంకా జరగలేదు. ఒకవేళ రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించినా కూడా అసంతృప్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

కొందరు నేతలు….

విజయశాంతి ఇప్పటికే తన దారి తాను చూసుకుంటున్నారు. బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. తాజాగా సర్వే సత్యనారాయణ కూడా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. మరికొందరు ముఖ్యమైన నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. అయితే తమ ప్రాంతంలో బీజేపీ నాయకత్వాన్ని బట్టి వారు పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నారు. బీజేపీ నాయకులు బలంగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో పెద్దగా చేరికలు ఉండవు.

బీజేపీ కే ఎక్కువగా…..

బీజేపీ కూడా కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు సిద్ధమవుతోంది. దుబ్బాకలో మూడో స్థానానికి నెట్టగలడంతో బీజేపీ నేతల్లో మరింత విశ్వాసం పెరిగింది. దీంతో గ్రేటర్ ఎన్నికలు ముగిసిన తర్వాత చేరికలకు బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇప్పటికే బీజేపీ ఒక జాబితాను సిద్ధం చేసి పెట్టుకుంది. కాంగ్రెస్ నుంచే ఎక్కువ మంది నేతలను చేర్చుకుని తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతం చేయాలన్న వ్యూహంలో ఉంది. మొత్తం మీద కాంగ్రెస్ తెలంగాణలో కోలుకోవడం కష్టమేనన్నది వాస్తవం.

Tags:    

Similar News