కెలుకుతూనే ఉంటే…ఎప్పటికైనా కటీఫ్ అని తెలియదా?

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ టెన్షన్ పెడుతూనే ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ మద్దతుతో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అయితే కాంగ్రెస్ నిత్యం కెలుకుతూనే ఉంటుంది. ఇది కొత్తేమీ కాదు. [more]

Update: 2020-05-11 17:30 GMT

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ టెన్షన్ పెడుతూనే ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ మద్దతుతో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అయితే కాంగ్రెస్ నిత్యం కెలుకుతూనే ఉంటుంది. ఇది కొత్తేమీ కాదు. అందుకే కాంగ్రెస్ మద్దతుతో నడుస్తున్న ప్రభుత్వాలు అనేక రాష్ట్రాల్లో కుప్పకూలిపోయాయి. డ్రైవింగ్ సీట్ లో తాము లేకున్నా రిమోట్ కంట్రోల్ తమ దగ్గరే ఉండాలని కాంగ్రెస్ భావించడమే అసలు సమస్యకు కారణంగా మారుతుంది.

కర్ణాటకలోనూ అంతే…..

కర్ణాటక రాష్ట్రాన్ని తీసుకుంటే కాంగ్రెస్ మద్దతుతో కుమారస్వామి ప్రభుత్వం పథ్నాలుగు నెలలు అధికారంలో ఉంది. పథ్నాలుగు నెలలు కుమారస్వామిని కాంగ్రెస్ నేతలు ముప్పు తిప్పలు పెట్టారు. దీంతో కుమారస్వామి కూడా కాంగ్రెస్ లో చీలిక తేవడం ప్రారంభించారు. ఇక్కడి నుంచే అసలు సమస్య ప్రారంభమయింది. దీంతో చివరకు కర్ణాటకలో కాంగ్రెస్ మద్దతుతో నడుస్తున్న కుమారస్వామి ప్రభుత్వం కుప్ప కూలిపోయింది. దీనికి కారణం కాంగ్రెస్ మాత్రమే.

మహారాష‌్ట్రలో తాజాగా….

ఇక మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ మద్దతుతోనే ఉద్ధవ్ థాక్రే పాలన చేస్తున్నారు. అయితే ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాకపోవడంతో ఈ నెల 28వ తేదీలోగా ఎన్నిక కావాల్సి ఉంది. మొన్నటి వరకూ కరోనా కారణంగా ఎన్నికలు జరుగుతాయో లేదో అన్న టెన్షన్ ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ తోనే కొద్దిరోజులు టెన్షన్ పడాల్సి వచ్చింది. మహారాష్ట్రలోని 9 శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ నెల 21 వతేదీన ఎన్నికలు జరగనున్నాయి.

ఎట్టకేలకు అంగీకరించి…..

ఏకగ్రీవం చేస్తే ఇక ఎన్నికల ప్రక్రియ ఉండదని భావించి ఉద్ధవ్ థాక్రే మిత్రపక్షాలతో చర్చలు జరిపారు. ఎన్సీపీ కొంత సంయమనంతో ఉన్నా కాంగ్రెస్ మాత్రం కంగారు పెట్టింది. బీజేపీకి నాలుగు, కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల కూటమికి బలాబలాలను బట్టి ఐదు స్థానాలు దక్కుతాయి. అయితే కాంగ్రెస్ మాత్రం ఇద్దరు అభ్యర్థుల చేత నామినేషన్ వేయించడంతో ఎన్నిక అనివార్యమనుకున్నారు. చివరకు కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఉద్ధవ్ థాక్రే ఊపిరి పీల్చుకున్నారు. ఇలా కాంగ్రెస్ తాను మద్దతిచ్చి అధికారంంలో ఉన్న వారిని నిత్యం కెలుకుతూనే ఉంటుందనడానికి ఇదే ఉదాహరణ.

Tags:    

Similar News