ఊపిరాడటం లేదే… ఊరుకునేటట్లు లేరే?

ఎన్నికల్లో వైఫల్యాలు, అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న హస్తం పార్టీకి సరికొత్త చిక్కులు ఎదుదరవుతున్నాయి. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ విరాళాల పేరుతో వచ్చిన సమస్య పార్టీ మెడకు చుట్టుకుంది. [more]

Update: 2020-07-29 16:30 GMT

ఎన్నికల్లో వైఫల్యాలు, అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న హస్తం పార్టీకి సరికొత్త చిక్కులు ఎదుదరవుతున్నాయి. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ విరాళాల పేరుతో వచ్చిన సమస్య పార్టీ మెడకు చుట్టుకుంది. దీంతో హస్తం పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది. ఈ ఆరోపణలను తిప్పకొట్టలేక సతమవుతోంది. మరో పక్క అధికార బీజేపీ ఇదే అవకాశంగా కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్.జి.ఎఫ్ కు విరాళాల అంశంపై విచారణకు కేం ద్రప్రభుత్వం ఆదేశించడంతో హస్తం పార్టీ కష్టాలు మరింత అధికమయ్యాయి. చైనాతో ఘర్షణలో 20 మంది సైనికుల హతం, ఇప్పటికీ తొలగని ప్రతిష్టంభన కారణంగా ఆత్మరక్షణలో పడిపోయిన అధికార బీజేపీకి ఆర్.జి.ఎఫ్ విరాళాల అంశం ఒక ఆయుధంగా మారింది.

పదిహేనేళ్లు వెనక్కు వెళితే….

రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఏమిటి, దానికి చైనా ఎందుకు విరాళాలు ఇచ్చింది? ఇది ఎలా వెలుగులోకి వచ్చింది తదితర అంశాలు తెలుసుకోవాలంటే సుమారు పది‍హేనేళ్ళు వెనక్కు వెళ్ళాలి. 1991 మేలో రాజివ్ గాంధీ హత్యానంతరం పి.వి.నరసింహరావు సారధ్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్నడింది. వెనువెంటనే అదే ఏడాది జుాన్ 21 న రాజివ్ గాంధీ ఫౌంగేషన్ ఏర్పడింది. దీనికి కాంగ్రెస్ అధినేత్రి సోనియంగాంధీ అధ్యక్షురాలు. విద్య, వైద్యం, సాహిత్యం, వికలాంగులు, మహిళ శిశు సంక్షేమం, పంచాయితీ సంస్ధల బలోపేతం, సహజ వనరుల పరిరక్షణ ఫౌండేషన్ లక్ష్యాలు. ఇందులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం, నాటి ప్రణాళిక సంఘంలో డిప్యూటి చైర్మన్ మాంటింక్ సింగ్ ఆహ్లువాలియా, సుమన్ దుాబె, ఎమ్.ఎస్.స్వామినాధన్, సంజీవ్ గోయంకా, అశోక్ గంగుాలీ సభ్యులుగా ఉన్నారు. 2004 లో కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఎ ప్రభుత్వం అధికాంలోకి వచ్చాక ఆర్.జి.ఎఫ్ కు చైనా నుంచి పెద్ద మెుత్తంలో విరాళాలు వచ్చాయన్నది బీజేపీ ఆరోపణ. పార్టీ అధ్యక్షుడు జె.పి నడ్డా, కేంద్రమంత్రులు స్మృతిఇరాని, రవిశంకర్ ప్రసాద్ ఈ ఆరోపణలు చేయడంలో ముందంజలో ఉన్నారు. బీజేపీ ఐ.టీ విభాగం అధిపతి మాలవీయ కుాడా ఇందుకు సంబంధించిన ఆరోపణలను గుప్పిస్తున్నారు.

రెండు పార్టీల మధ్య ఒప్పందం…

2008 లో అంటే యు.పి.ఎ హయాంలోనే చైనా కమ్యూనిస్టు పార్టీ – కాంగ్రెస్ పార్టీ మధ్య ఒక అవగాహన ఒప్పందం (ఎమ్.ఒ.యు) కుదిరింది. చైనా రాజధాని బీజింగ్ లో ఈ మేరకు కాంగ్రెస్ – చైనా కమ్యూనిస్టు పార్టీ (సి.పి.సి) ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. కాంగ్రెస్ తరపున నాటి పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ నేతలు సంతకాలు చేశారు. సోనియా గాంధీ, నాటి చైనా ఉపాధ్యక్షుడు జిన్ పింగ్ (ప్రస్తుత అధ్యక్షుడు) సమక్షంలో ఈ ఒప్పందం రుాపుదిద్దుకుంది. ఒక విదేశీ సంస్ధతో, అదీ శత్రుదేశంగా పరిగణించే చైనాతో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని బీజేపీ సూటిగా ప్రశ్నిస్తోంది. ఒప్పంద వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేస్తోంది. బీజేపీ నాయకుడు మహేశ్ జఠ్మాలనీ ఒప్పందానికి సంబంధించిన ఛాయాచిత్రాన్ని ఇటీవల రిలీజ్ చేయడం సంచటనం కలిగించింది. మహేశ్ జఠ్మలానీ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. ఆయన తండ్రి రాంజెఠ్మలానీ కుాడా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. పూర్వాశ్రమంలో బీజేపీ నాయకుడు. వాజ పేయి హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు.

చైనా రాచమర్యాదలు….

సిపిసి – కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరినప్పటి నుంచి రెండుపార్టీల నాయకుల మధ్య అనుబంధం పెరిగింది. 2008 లో చైనా రాజధాని బీజింగ్ లో జరిగిన ఒలింపిక్స్ వేడుకలకు సోనియాగాంధీ హాజరయ్యారు. వాస్తవానికి దేశాధినేతగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరవ్వాల్సి ఉంది. సోనియాతో వెళ్ళిన కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకాగాంధీ, అల్లుడు రాబర్ట్ వాద్రాలకు అప్పట్లో చైనా రాచమర్యాదలు చేసింది. 2018 లో రాహుల్ గాంధీ మానస సరోవర్ యాత్రకు చైనా సంపూర్ణంగా సహకరించింది. నాటి చైనా రాయబారి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశారు. వీటిని బీజేపీ నాయకులు అదేపనిగా ఎత్తి చూపు తుండటంతో హస్తం పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సరైన సమాధానం చెప్పలేక సతమవుతోంది.

ఎదురు దాడి చేస్తున్నా….

దానికి ప్రతిగా ప్రధాన మంత్రి సహాయనిధికి కూడా చైనా నుంచి విరాళాలు వస్తున్నాయని ఎదురుదాడి చేస్తోంది. ఆరోపణలు నిగ్గు తేల్చేందుకు సిబిఐ, ఎన్ఐఎ చేత దర్యాప్తు చేయించాలని కోరుతుా సుప్రింకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలైంది. శశాంక్ శేఖర్ అనే న్యాయవాది, పాత్రికేయుడు సావిడి రోడ్రిన్స్ దీనిని దాఖలు చేశారు. మరోపక్క ఆర్.జి.ఫ్ ఫౌండేషన్ పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి విచారణకు కేంద్రంలో మత్రిత్వశాఖ ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ మేరకు ఈనెల 8 న ఉత్తర్వులు జారీచేసింది. ఆర్.జి.ఎఫ్ తో పాటు, రాజివ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్, ఇందిరాగాంధీ మెమెారియల్ ట్రస్ట్ లపై వచ్చిన ఆరోపణలను కుాడా ఈ కమిటీ విచారిస్తుంది. ఆదాయ పన్ను, పి.ఎమ్.ఎల్.ఎ, ఎఫ్.సి.ఆర్.ఎ తదితర చట్టాల కింద ఇంటర్ మిస్టీరియల్ కమిటీ విచారణ జరపనుంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఊపిరాడటం లేదు. రాజస్ధాన్ సంక్షోభంతో కిందామీద పడుతున్న హస్తం పార్టీకి ఇదో కొత్త సమస్యగా మారింది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News