జగన్ కు ముందున్నవన్నీ మంచిరోజులేనట

వైసీపీకి రాజకీయంగా చాలా ఇబ్బందులు తగ్గే సూచనలు ఈ ఏడాది కనిపిస్తున్నాయి. శాసనమండలిలో ఎదురులేని బలం ఉందనుకున్న టీడీపీకి ఈ ఏడాది మాత్రం గడ్డు కాలమనే చెప్పాలి. [more]

Update: 2021-03-01 12:30 GMT

వైసీపీకి రాజకీయంగా చాలా ఇబ్బందులు తగ్గే సూచనలు ఈ ఏడాది కనిపిస్తున్నాయి. శాసనమండలిలో ఎదురులేని బలం ఉందనుకున్న టీడీపీకి ఈ ఏడాది మాత్రం గడ్డు కాలమనే చెప్పాలి. ఏకంగా 22 ఎమ్మెల్సీ సీట్లు ఈ ఏడాది ఖాళీ అవుతాయని తెలుస్తోంది. ఇవన్నీ దాదాపుగా వైసీపీ పరం కావడం లాంచనం అని వేరేగా చెప్పాల్సిన అవసరం. లేదు. ఈ 22 ఎమ్మెల్సీ స్థానాల్లో 17 దాకా ఎమ్మెల్యే , స్థానిక సంస్థలు, నామినేటెడ్ కోటాల ద్వారా ఎమ్మెల్సీలు కానున్నారు. ఇపుడు శాసనసభలో బలం చూసుకున్నా స్థానిక సంస్థల ఎన్నికలలో తీరు చూసుకున్నా వైసీపీకి పూర్తిగా సీట్లు వస్తాయని పక్కాగా లెక్కలు వేస్తున్నారు.

ఇదీ అసలు లెక్క…..

జగన్ కి ఇపుడు వాస్తవాలు తెలిసివచ్చాయి. శాసన‌ మండలి ద్వారా ఎన్ని రకాలుగా రాజకీయం చేయవచ్చో టీడీపీ చెప్పింది. ఇపుడు ఎగువ సభలో టీడీపీకి 29 మంది ఎమ్మెల్సీల బలం ఉంది. అది కాస్తా ఈ ఏడాది జూన్ నాటికి 12కి పడిపోతుంది అంటున్నారు. జూన్ లో స్థానిక సంస్థల కోటా కింద 11 మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేయనున్నారు. ఇక గవర్నర్ ద్వారా నామినేటెడ్ అయిన వారు మరో ముగ్గురు రాజీనామా చేస్తారు. ఎమ్మెల్యే కోటాలో ఎనిమిది మంది ఎమ్మెల్సీల పదవులు ఖాళీ అవుతాయట. ఇందులో టీడీపీకి చెందినవే 17 ఉన్నాయి. ఇవన్నీ కూడా గుత్తమొత్తంగా వైసీపీకి వస్తాయి. అంటే మండలిలో టీడీపీ పూర్తి బలంతో ఉంటుదన్న మాట.

నాడు వద్దని…

నాడు జగన్ శాసనమండలి వద్దు అంటూ పెద్ద యాగీనే చేశారు. ఇపుడు మండలిలో వైసీపీకే జెండా ఎగరేసే రోజులు వచ్చాయని అంటున్నారు. మొత్తం 58 మంది శాసనమండలిలో ఉంటే ఇందులో ఎమ్మెల్యేల కోటలో 20 మంది, స్థానిక సంస్థల నుంచి మరో 20 మంది నెగ్గుతారు. అలాగే గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే వారు ఎనిమిది మంది ఉంటారు. ఉపాధ్యాయులు పట్టభద్రుల కోటా చేరో అయిదూ ఉంటాయి. ఈ పది మందిని పక్కన పెట్టినా 48 సీట్లలో అత్యధిక శాతం వైసీపీకి దక్కడం ఖాయం. అందుకే జగన్ ఇపుడు మండలి రద్దు విషయంలో పట్టుబట్టడంలేదు అంటున్నారు. అసెంబ్లీ, మండలిలలో వైసీపీ ఉంటే కచ్చితంగా జగన్ మరిన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిధ్ధపడతారు అంటున్నారు.

ఆశావహులు ఎక్కువే …..

ఇదిలా ఉంటే వైసీపీలో పదేళ్ల పాటు అన్నీ వదులుకుని పనిచేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. వారంతా ఎమ్మెల్యేలు కావాలనుకున్నారు. కానీ కొన్ని సమీకరణల నేపధ్యంలో వేరే వారికి టికెట్లు ఇవాల్సి వచ్చింది. దాంతో ఎమ్మెల్సీ పదవులు ఇపుడు అటువంటి వారు కోరుతున్నారు. ఇక ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు, వివిధ సామాజిక వర్గాల సమీకరణలతో డిమాండ్లు పెడుతున్న వారు జగన్ ముందు తన విన్నపాలు ఉంచారు. ఈ ఏడాది పెద్ద ఎత్తున శాసనమండలి పదవులు రానున్నందువల్ల జగన్ ఆచీ తూచీ వారిని ఎంపిక చేస్తారని అంటున్నారు. చూడాలి మరి ఆ లక్ ఎవరెవరికి దక్కుతుందో.

Tags:    

Similar News