వార్ బిగినయింది

తెలంగాణ కాంగ్రెస్‌లో మ‌ళ్లీ యుద్ధం ప్రారంభ‌మైంది. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. టికెట్ల కోసం ప్ర‌య‌త్నిం చేవారు, టికెట్ట‌ను క‌న్ఫ‌ర్మ్ చేసుకునేవారు అంటూ.. రెండు బ్యాచ్‌లు ఎప్పుడూ మ‌న‌కు [more]

Update: 2019-09-19 09:30 GMT

తెలంగాణ కాంగ్రెస్‌లో మ‌ళ్లీ యుద్ధం ప్రారంభ‌మైంది. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. టికెట్ల కోసం ప్ర‌య‌త్నిం చేవారు, టికెట్ట‌ను క‌న్ఫ‌ర్మ్ చేసుకునేవారు అంటూ.. రెండు బ్యాచ్‌లు ఎప్పుడూ మ‌న‌కు కాంగ్రెస్ లో క‌నిపిస్తాయి. అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం ఎక్కువ‌గా ఉన్న కాంగ్రెస్‌లో ఈ త‌రహా ప‌రిస్థితి కొన్ని ద‌శాబ్దాలుగా ఉంది. ఇక‌, ఈ స‌మ‌యంలోనే కీల‌క నేత‌ల మ‌ధ్య ఉన్న విభేదాలు కూడా ర‌చ్చ‌కెక్కుతూ ఉంటాయి. తాజాగా తెలంగాణ‌లో ఇద్ద‌రు కీల‌క నేత‌ల మ‌ధ్య వివాదం ప్రారంభ‌మైంది. హుజూర్‌న‌గ‌ర్ అసెంబ్లీ స్థానానికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. 2018 డిసెంబ‌రులో జ‌రిగిన రాష్ట్ర ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ విజ‌యం సాధించారు.

పద్మావతి అభ్యర్థి అంటూ….

అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఆయ‌న న‌ల్ల‌గొండ నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. దీంతో నిబంధ‌న‌ల ప్ర‌కారం హుజూర్ న‌గ‌ర్ స్థానాన్ని వ‌దులు కోవాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యం లో ఇక్క‌డ బైపోల్ అనివార్యంగా మారింది. అయితే, కాంగ్రెస్ త‌ర‌ఫున ఈ టికెట్ ఎవ‌రికి ఇవ్వాల‌నే విష‌యం పై త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు సాగుతున్నాయి. ముందుగా దీనిపై దృష్టి పెట్టిన ఉత్త‌మ్.. గ‌త ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన త‌న స‌తీమ‌ణి ప‌ద్మావ‌తికి కేటాయించాల‌ని భావించారు. ఇదే ఇప్పుడు వివాదానికి కార‌ణ‌మైంది. కొన్ని రోజులుగా పార్టీ నేత‌ల వైఖ‌రితో విస్తు పోతున్న యువ నాయ‌కుడు రేవంత్ రెడ్డి.. తాజాగా ఈ వివాదంలో వేలు పెట్టారు.

రేవంత్ మాత్రం….

రేవంత్‌ రెడ్డి హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో టికెట్‌ను చామల కిరణ్‌రెడ్డికి ఇవ్వాల ని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ఉత్తమ్‌- రేవంత్‌ వర్గాల మధ్య టికెట్‌ వార్‌ మొదలైంది. కాగా పద్మవతిని గెలిపించుకునేందుకు ఉత్తమ్‌ ఇదివరకే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. స్థానిక నేతలను కలుస్తూ.. మద్దతును కూడగట్టుకుంటున్నారు. మ‌రోప‌క్క‌, రేవంత్ త‌న‌స్వ‌రాన్ని పెంచుతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న పీసీసీ రేసులో ఉన్న విష‌యం తెలిసిందే. రాష్ట్రంలో త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు చేయ‌డంలోను, సీఎం కేసీఆర్ కంట్లో న‌ల‌క‌గా రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టించ‌డంలోనూ రేవంత్ గ‌ట్టి పేరే సంపాయించుకున్న విష‌యం తెలిసిందే.

ఓడిపోయిన వారికి….

కోదాడలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ప‌ద్మావ‌తికి ఇప్పుడు మ‌ళ్లీ టిక్కెట్ ఎలా ? ఇస్తార‌ని రేవంత్ ఫైర్ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తెలంగాణ‌లో స‌త్తా చాటాల‌ని డిసైడ్ అయిన రేవంత్ ఉత్త‌మ్‌నే ఢీకొట్టేందుకు రెడీగా ఉన్నట్టే తాజా ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఆయ‌న వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే, ఆయ‌న ఉత్త‌మ్ వ్య‌వ‌హార‌శైలిపై ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇటీవ‌ల గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసేందుకు వెళ్లిన స‌మ‌యంలోనూ త‌న‌కు ఆహ్వానం అంద‌లేద‌ని ఆయ‌న బ‌హిరంగ విమ‌ర్శ‌లే చేస్తున్నారు. ఇక నల్లగొండకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ పక్షాన నిలిచారు. అక్కడ అభ్యర్థి పద్మావతి అని ప్రకటించారు. తమను కాదని పొరుగు జిల్లాల నేతలు ఎలా తమ జిల్లాలో కల్పించుకుంటారని పరోక్షంగా రేవంత్ ను ప్రశ్నించారు. ఇలా మొత్తంగా టీ కాంగ్రెస్‌లో తుఫాను చెల‌రేగుతోంది. అయితే, ఇది టీ క‌ప్పులో తుఫానా? లేదా? చూడాలి!

Tags:    

Similar News