పీటముడి పడిందా….?

కర్ణాటకలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల ఒప్పందంపై పీటముడి పడేటట్లే ఉంది. జనతాదళ్ ఎస్ తక్కువ స్థానాలు గెలిచినా ఒక రకంగా [more]

Update: 2019-01-12 18:29 GMT

కర్ణాటకలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల ఒప్పందంపై పీటముడి పడేటట్లే ఉంది. జనతాదళ్ ఎస్ తక్కువ స్థానాలు గెలిచినా ఒక రకంగా అధికారంలో ఉన్న పార్టీగా చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడలు జనతాదళ్ ఎస్ ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ కు అతి తక్కువ స్థానాలు రావడంతో ప్రజల్లో విశ్వాసం లేదని దాదాపు తేలిపోయింది. గౌడ కుటుంబ పార్టీని ప్రజలు ఆదరించలేదన్నది గత ఎన్నికల ఫలితాలతో స్పష్టమయినప్పటికీ అనుకోని విధంగా అధికారం దక్కింది.

సత్తా చాటాలని….

అయితే ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో తాము సత్తా చాటాలని దేవెగౌడ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధిక స్థానాలను సాధించి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఈ కురువృద్ధుడి ఆలోచన. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో తప్పనిసరిగా మైత్రి కొనసాగించాలి. గత లోక్ సభ ఎన్నికల్లోనూ జేడీఎస్ కు పరాభవం తప్పలేదు. కేవలం రెండు పార్లమెంటు స్థానాలనే జేడీఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 9 స్థానాల్లో విజయం సాధించింది.

గత ఎన్నికల్లో…..

గత పార్లమెంటు ఎన్నికల్లో మోదీ ప్రభంజనం గట్టిగా వీచినా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో కొంత మెరుగైన ఫలితాలనే సాధించింది. జేడీెఎస్ మాత్రం ఉనికి కోల్పోయే విధంగా ఫలితాలు వచ్చాయి. దీంతో పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో పాటు రెండంకెల స్థానాల్లో విజయం సాధిస్తే జాతీయ రాజకీయాల్లో ముఖ్య పాత్ర తాను పోషించగలనని దేవెగౌడ గట్టిగా నమ్ముతున్నారు. చంద్రబాబు వంటి వారు కాంగ్రెస్ కూటమి కోసం ప్రయత్నిస్తుండటం కూడా దేవెగౌడలో ఆశలు కల్పించింది.

గట్టిగా కోరుతున్నా…..

దీంతో ఆయన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 12 స్థానాలను జేడీఎస్ కు కోరుతున్నారు. అయితే గతంలో గెలిచిన 9 స్థానాలను తాము వదులుకునేందుకు సిద్ధంగా లేమని కాంగ్రెస్ తేల్చిచెబుతోంది. బలం లేని చోట పోటీ చేసి బీజేపీకి అవకాశమివ్వడం ఎందుకన్న ప్రశ్న కాంగ్రెస్ నుంచి వస్తోంది. కాంగ్రెస్ నేతలు కూడా జేడీఎస్ కు అన్ని స్థానాలు ఇచ్చేందుకు అంగీకరించడంలేదు. జేడీఎస్ కు తమ స్థానాన్ని కేటాయిస్తే తాము సహకరించబోమని కొన్నిచోట్ల నుంచి కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరించడం కూడా ప్రారంభించాయి. దీంతో రెండు పార్టీల మధ్య సీట్ల ఒప్పందంపై కొంత ఇబ్బందికర పరిస్థితులున్నాయని చెప్పక తప్పదు.

Tags:    

Similar News