ముఖం చాటేశారెందుకో?

కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఎవరూ లెక్క చేసే పరిస్థిితిలో లేరు. దాదాపు పదేళ్లు అధికారాన్ని చెలాయించిన కాంగ్రెస్ పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి. అయితే కాంగ్రెస్ చరిత్రలో [more]

Update: 2020-01-13 18:29 GMT

కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఎవరూ లెక్క చేసే పరిస్థిితిలో లేరు. దాదాపు పదేళ్లు అధికారాన్ని చెలాయించిన కాంగ్రెస్ పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి. అయితే కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేని సంక్షోభాన్ని నేడు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా నాయకత్వ సమస్యతో అల్లాడుతుంది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ ఓటమి పాలు కావడంతో సొంత పార్టీ నేతలే యాక్టివ్ గా లేక పార్టీని పూర్తిగా వదిలేశారు.

తాత్కాలికంగానే…..

మరోవైపు సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక అధ్యక్ష్యురాలిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జార్ఖండ్, మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసినప్పటికీ ఆ పార్టీలో పూర్తి స్థాయిలో జోష్ రాలేదనే చెప్పాలి. ఇక మోదీని దేశంలో ఢీకొట్టాలంటే కాంగ్రెస్ కు సాధ్యం కావడం లేదు. అందరినీ కలుపుకుని వెళితేనే ఎదుర్కొనేందుకు అవకాశముంటుంది. అందుకోసమే పౌరసత్వ చట్ట సవరణ, ఎన్సార్సీ విషయంలో అభ్యంతరం వ్యక్తం కాంగ్రెస్ ఒంటరిగా ఆందోళన చేసినా ఫలితం లేదు.

ఐక్యంగా వెళ్లాలని…..

దీంతో విపక్షాలతో ఐక్యంగా ముందుకు వెళ్లాలని భావించారు. ఇందుకోసం ఢిల్లీలో సోనియా గాంధీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశానికి బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నింటికీ ఆహ్వానాలు అందాయి. అయితే ఎక్కువ మంది ముఖం చాటేశాయి. నిజానికి ఎన్సార్సీ పై దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలతో కలసి ఉద్యమించాలన్నది కాంగ్రెస్ ఆలోచన. అందరూ కలస్తేనే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని సోనియాగాంధీ సయితం భావించారు.

గైర్హాజరయి….

అయితే ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ రానని ముందే చెప్పేశారు. ఆ తర్వాత మమత బాటలోనే బహుజన్ సమాజ్ పార్టీ నేత మాయావతి కూడా నడిచారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలోనే ఈ భేటీకి వారు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ తో తొలి నుంచి ఉన్న ఎన్సీపీ, వామపక్ష పార్టీలు, ఆర్జేడీ, డీఎంకే, సమాజ్ వాదీ పార్టీలు మాత్రమే హాజరయ్యాయి.

Tags:    

Similar News