Congress : ఇద్దరూ ముందే రాజీనామాకు సిద్ధమయ్యారా?

కాంగ్రెస్ పార్టీకి కొంత హోప్ వచ్చింది. కొంచెం కష్టపడితే అధికారంలోకి రావచ్చన్న ఆశ మొదలయింది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడం పక్కన పెడితే, సహజంగా ప్రభుత్వంపైన, [more]

Update: 2021-10-17 11:00 GMT

కాంగ్రెస్ పార్టీకి కొంత హోప్ వచ్చింది. కొంచెం కష్టపడితే అధికారంలోకి రావచ్చన్న ఆశ మొదలయింది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడం పక్కన పెడితే, సహజంగా ప్రభుత్వంపైన, అధికార పార్టీపైన వ్యతిరేకత మొదలయింది. కొన్ని పథకాల పట్ల కొన్ని వర్గాల్లో అసంతృప్తి మొదలయింది. ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో అధికార పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస పార్టీ నేతలు కూడా క్రమంగా యాక్టివ్ అవుతున్నారు.

ముందే అసెంబ్లీ ఎన్నికలు….

పార్లమెంటు ఎన్నికలకు ముందే తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. ఒక ఏడాది ముందే జరిగే ఈ ఎన్నికలకు పార్లమెంటు సభ్యులు కూడా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. గెలిస్తే ముఖ్యమంత్రి పదవికి పోటీ పడవచ్చు. లేదంటే కనీసం మంత్రి పదవి అయినా దక్కించుకోవచ్చన ఆలోచన మొదలయింది. ప్రధానంగా ఇద్దరు పార్లమెంటు సభ్యులు తిరిగి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయడానికి సిద్దమవుతున్నారు.

తిరిగి కొడంగల్ నుంచి….

రేవంత్ రెడ్డి 2018 లో జరిగిన ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోట ీచేసిన రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. రేవంత్ రెడ్డి కొడంగల్ లో 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి రెండుసార్లు విజయం సాధించారు. అయితే 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మల్కాజ్ గిరి నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అయితే మరోసారి కొడంగల్ నుంచి పోటీ చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కొడంగల్ లో పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కొడంగల్ కు ఎవరిని ఇన్ ఛార్జిని కూడా నియమించలేదు.

కోమటిరెడ్డి కూడా….

మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఎంపీగా ఉన్నారు. ఆయన కూడా వచ్చే శాసనసభ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్దమవుతున్నారు. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పట్టుంది. గత ఎన్నికల్లో ఓటమి పాలయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తర్వాత జరిగిన భువనగిరి ఎంపీ గా గెలుపొందారు. ఇప్పుడు మళ్లీ నల్లగొండ పర్యటనలు చేస్తున్నారు. 2023లో జరిగే ఎన్నికల్లో నల్లగొండ నుంచే తిరిగి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేయనున్నారు. అయితే ఏడాది ముందే జరగనున్న ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ హైకమాండ్ అనుమతిస్తుందో? లేదో? చూడాలి.

Tags:    

Similar News