మొత్తం ఖాళీ అయ్యేటట్లుందే?

కాంగ్రెస్ పార్టీ వరస ఓటములతో తెలంగాణలో కుదేలైపోయింది. వచ్చే ఎన్నికల నాటికి ఇది పుంజుకుంటుందా? లేదా? అన్నది కూడా సందేహమే. 2014 ఎన్నికల నుంచి వరస ఓటములు [more]

Update: 2021-05-27 09:30 GMT

కాంగ్రెస్ పార్టీ వరస ఓటములతో తెలంగాణలో కుదేలైపోయింది. వచ్చే ఎన్నికల నాటికి ఇది పుంజుకుంటుందా? లేదా? అన్నది కూడా సందేహమే. 2014 ఎన్నికల నుంచి వరస ఓటములు చవి చూస్తుండటంతో కాంగ్రెస్ పై నేతలకే నమ్మకం లేదు. ఉన్న నేతలు తమ నియోజకవర్గ పరిధికే పరిమితమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేేసే నాయకుడు ఇప్పుడు లేరు. పీసీసీ చీఫ్ ను ఎవరిని నియమించినా పెద్దగా ప్రయోజనం లేదంటున్నారు. సాగర్ ఉప ఎన్నికలో ఓటమితో మరింత డీలా పడ్డారు.

ఇతర పార్టీల వైపు….?

ఈలోపే అనేక మంది ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ లో ఉంటే ఫ్యూచర్ ఉండదని భావించిన నేతలు ఇప్పటికే కొందరు సర్దుకోగా, మరికొందరు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ నేతల్లో సమన్వయం లేకపోవడం, నాయకత్వ లేమి, వరస పరాజయాలతో ఇక కాంగ్రెస్ లో ఉండి సాధించేదేమీ లేదని అనేక మంది నేతలు ఫిక్స్ అయ్యారు. వీరిలో కొందరుసీనియర్ నేతలు కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారని తెలిసింది.

టీఆర్ఎస్ ఆకర్ష్ కు….

తెలంగాణ రాష్ట్ర సమితి కూడా కాంగ్రెస్ నేతలను ఆకర్షించే పనిలో పడింది. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ సొంత బలమున్న కాంగ్రెస నేతలున్నారు. వారిని పార్టీలోకి తీసుకోవడం ద్వారా నియోజకవర్గంలో మరింత పట్టుపెంచుకోవాలని టీఆర్ఎస్ చూస్తుంది. పార్టీలోకి వచ్చే వారికి పదవులు కూడా ఉంటాయని సంకేతాలు పంపుతుంది. సునీతా లక్ష్మారెడ్డి వంటి వారిని తీసుకుని కేబినెట్ ర్యాంకున్న పదవి ఇచ్చింది. దీంతో ఎమ్మెల్యే టిక్కెట్ కాకపోయినా అధికార పార్టీవైపు కొందరు కీలక నేతలు మొగ్గు చూపుతారన్న టాక్ కాంగ్రెస్ పార్టీలో బలంగా విన్పిస్తుంది.

ముఖ్యనేతలను…?

అయితే వెళ్లే నేతలను ఆపేందుకు కాంగ్రెస్ లో ఎటువంటి దిక్కూ మొక్కూ లేకుండా పోయింది. కనీసం వారి అసంతృప్తికి గల కారణాలను తెలుసుకుని హామీ ఇచ్చేందుకు కూడా నేతలేకపోవడంతో త్వరలోనే ఇద్దరు మాజీ మంత్రులు, మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడతారన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఖాళీ కాక తప్పదన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.

Tags:    

Similar News