ఎవరు వచ్చినా కష్టమేనా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ముందు ముందు కష్టకాలమే. పార్టీకి తిరిగి పూర్వవైభవం తేవడం కొత్త నేతకు పెద్ద సవాల్ గా మారనుంది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ [more]

Update: 2020-12-17 11:00 GMT

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ముందు ముందు కష్టకాలమే. పార్టీకి తిరిగి పూర్వవైభవం తేవడం కొత్త నేతకు పెద్ద సవాల్ గా మారనుంది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మరొకరిని నియమించాల్సి ఉంది. అయితే సీనియర్ నేతల పేర్లు వినపడుతున్నప్పటీకి ఎవరు పీసీసీ బాధ్యతలు చేపట్టినా వారికి ముందు ముందు సవాల్ అని చెప్పక తప్పదు.

క్యాడర్, లీడర్లను…..

కాంగ్రెస్ పార్టీ గత ఆరేళ్ల కాలంలో క్యాడర్ తో పాటు లీడర్లను కూడా కోల్పోయింది. ఆరేళ్ల నుంచి అధికారంలోకి రాలేకపోవడంతో అనేక మంది పార్టీని వీడి వెళ్లిపోయారు. క్యాడర్ కూడా అనేక చోట్ల నిస్సత్తువగానే ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి కూడా ఎవరూ ముందుకు రాకపోవడం దీనిని సూచిస్తుంది. ఏ జిల్లాలోనై కాంగ్రెస్ కు సరైన నాయకత్వం లేదు. పార్టీని ముందుండి నడిపించే నాయకుడు లేరు.

ఆర్థికంగా ఇబ్బందులు…..

ఆరేళ్ల నుంచి అధికారంలో లేకపోవడంతో ఆర్థికంగా కూడా నేతలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో పార్టీ చేపట్టే ఏ కార్యక్రమాలను కూడా జరిపేందుకు ముందుకు రావడం లేదు. దీనికి తోడు జిల్లాల్లో బహు నాయకత్వం ఉంది. నేతల మధ్య ఉన్న విభేదాలు కూడా పార్టీని బాగా కుంగదీస్తున్నాయి. పార్టీలో ఒకరినొకరు ఫిర్యాదు చేసుకోవడం, ఆరోపణలు చేసుకోవడానికే ఎక్కువ సమయం నేతలు గడుపుతున్నారు.

పూర్తి ప్రక్షాళన…

దీంతో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరైనా ముందుగా నేతలను సమన్వయం చేసుకుని వెళ్లాలి. అది తెలంగాణ కాంగ్రెస్ లో సాధ్యమయ్యే పనికాదు. హైకమాండ్ ఆశీస్సులున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్లే కాలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చే పీసీసీ నేత తనపై నమ్మకం కల్గించాలి. ప్రధానంగా క్యాడర్, ప్రజల్లో నాయకత్వం పట్ల విశ్వాసం కలిగించితేనే పార్టీకి మనుగడ ఉంటుంది. అంతేకాని పీసీసీ అధ్యక్షుడు మారినంత మాత్రాన కొత్తగా వచ్చే ప్రయోజనం ఏమీ లేదు.

Tags:    

Similar News