కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేశారే

కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది. దిశానిర్దేశం చేసే నాధుడు లేక డీలా పడింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ [more]

Update: 2019-11-15 09:30 GMT

కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది. దిశానిర్దేశం చేసే నాధుడు లేక డీలా పడింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకృతి చికత్స కోసం కర్ణాటక వెళ్లారు. తెలంగాణలో మాత్రం హాట్ హాట్ గా రాజకీయాలు నడుస్తున్నాయి. ఆర్టీసీ సమ్మె తీవ్ర స్థాయిలో జరుగుతుండగా కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం చూస్తూ ఊరుకోవాల్సి వస్తుంది. అధికార పార్టీ చేస్తున్న తప్పుులను ఎత్తి చూపే అవకాశం కూడా కాంగ్రెస్ నేతలకు లేకుండా పోయింది.

పీసీసీ చీఫ్ గా ఉన్నా…..

ఉత్తమ్ కుమార్ రెడ్డి నేటికీ పీసీసీ చీఫ్ గానే కొనసాగుతున్నారు. పీసీసీ చీఫ్ ను మార్చాలంటూ గత కొంతకాలంగా అధిష్టానం పై కొందరు సీనియర్ నేతలు వత్తిడి తెస్తున్నారు. అయినా అధిష్టానం దీనిపై ఎటువంటి చర్యకు దిగలేదు. ఇదిలా ఉండగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. ఆ సమయంలో హుజూర్ నగర్ ఎన్నికలో బిజీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచన మేరకే రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

రెండుగా చీలిపోయి…..

ప్రగతి భవన్ ముట్టడి తో కాంగ్రెస్ లో రెండు వర్గాలు గా చీలిపోయాయి. ఇప్పటికే గులాం నబీ ఆజాద్ ముందు సీనియర్ నేత వీహనుమంతరావు గుస్సా అయ్యారు. తమకు పార్టీలో విలువలేదని చెప్పారు. షబ్బీర్ ఆలీ, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వీహెచ్ బహిరంగంగానే ఆజాద్ ముందు బరస్ట్ అయ్యారు. దీంతో నాటి నుంచి రేవంత్ రెడ్డి కూడా సైలెంట్ అయ్యారు. నిజంగా రేవంత్ రెడ్డికి కొద్దో గొప్పో మాస్ ఇమేజ్ ఉంది. రేవంత్ పంచ్ లు ఆకట్టుకుంటాయి కూడా.

ఆదేశించేవారు లేక…..

అలాంటి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు మాటల దాడికి దిగుతుండటంతో ఆయన కూడా సైలెంట్ అయ్యారు. మరోవైపు పీసీసీ సారథి ఉత్తమ్ కుమార్ రెడ్డి విశ్రాంతిలో ఉన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు మద్దతు కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ఆర్టీసీ జేఏసీ చేపడుతున్న రోజువారీ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలు పెద్దగా పాల్గొనడం లేదు. ఇందుకు కారణం నేతల నుంచి సరైన ఆదేశాలు లేకమిన్నకుండి పోతున్నారు. కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకోలేదని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణలు ఏం కావాలి? అని క్యాడర్ నుంచే కామెంట్స్ విన్పిస్తున్నాయి. పీసీపీ పదవి కోసం పోటీ పడే నాయకులు పార్టీ పుంజుకునేందుకు మాత్రం ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు.

Tags:    

Similar News