తప్పదు…. హ్యాండ్ రైజింగ్ లో లేదుగా?

తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కక్క లేక మింగలేక అన్నట్లు ఉంది. కూటమి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. అలాగని వారిచ్చిన సీట్లతో సర్దుబాటు అయ్యేందుకు [more]

Update: 2021-03-07 16:30 GMT

తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కక్క లేక మింగలేక అన్నట్లు ఉంది. కూటమి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. అలాగని వారిచ్చిన సీట్లతో సర్దుబాటు అయ్యేందుకు మనసు అంగీకరించడం లేదు. అయినా తప్పుదు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కు తలవంచక తప్పదు. తమిళనాడు రాజకీయాల్లో జాతీయ పార్టీలకు పెద్దగా స్థానం లేదు. తొలి నుంచి కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలతోనే జట్టుకడుతూ వస్తుంది.

అధికారంలోకి వస్తామని…..

డీఎంకే కూటమిలో కాంగ్రెస్ ప్రధాన భాగస్వామిగా ఉంది. అయితే ఈసారి డీఎంకే కూటమి విజయం ఖాయమన్న వార్తలతో కొంత ఉత్సాహం తమిళ కాంగ్రెస్ నేతల్లో కన్పిస్తుంది. తాము కూడా ఈసారి అధికారంలో భాగస్వామ్యులమవుతామని ధీమాగా ఉంది. అయితే స్టాలిన్ మాత్రం కాంగ్రెస్ కు ఎక్కవ స్థానాలను ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఇరవై స్థానాలకు మించి ఇచ్చేది లేదని స్టాలిన్ తెగేసి చెప్పారు.

సర్దుకోవాల్సిందే….

కానీ చివరకు 25 స్థానాలను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేందుకు స్టాలిన్ సిద్ధపడ్డారు. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో తామే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలన్నది స్టాలిన్ ఆలోచన. అందుకే భాగస్వామ్య పార్టీలకు తక్కువ స్థానాలను ఇవ్వాలని నిర్ణయించారు. తాము 180 స్థానాల్లో పోటీ చేసి మిగిలిన 54 స్థానాలను మిత్ర పక్షాలకు పంచాలని నిర్ణయించారు. కానీ కాంగ్రెస్ మాత్రం తమకు ఎక్కువ స్థానాలను కావాలని కోరుతూ వస్తుంది. కన్యాకుమారి పార్లమెంటు నియోజకవర్గం స్థానాన్ని కూడా కాంగ్రెస్ కు కేటాయించారు. గత కొన్నాళ్లుగా తమిళనాడులో రాహుల్ గాంధీ ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. రాహుల్ సభలకు పెద్దయెత్తున ప్రజలు హాజరవుతున్నారు.

సాహసం చేయలేక…?

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు 24 స్థానాలకు మించి ఇవ్వలేమని స్టాలిన్ చెప్పేశారు. 2011లో కాంగ్రెస్ 63 స్థానాల్లో పోటీ చేసింది. 2016 ఎన్నికల్లో 41 స్థానాలకే కాంగ్రెస్ ను డీఎంకే పరిమితం చేసింది. ఇప్పుడు 25 స్థానాలను మాత్రమే ఇచ్చి సర్దుకొమ్మని చెబుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ కు సర్దుకు పోవడం మినహా మరో ఆప్షన్ లేదు. స్టాలిన్ ను కాదని బయటకు వచ్చే సాహసం చేయలేదు. ఎందుకంటే హ్యాండ్ రైజింగ్ లో లేదు కాబట్టి.

Tags:    

Similar News