ఇప్పడు కాంగ్రెస్ కు అక్కడ దిక్కెవరు?

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరో రెండేళ్లలో జరగనున్నాయి. అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎవరు నేతృత్వం వహిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ లో నిన్న మొన్నటి వరకూ [more]

Update: 2021-02-15 16:30 GMT

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరో రెండేళ్లలో జరగనున్నాయి. అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎవరు నేతృత్వం వహిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ లో నిన్న మొన్నటి వరకూ లెక్కకు మించి నేతలు ఉన్నారు. ఈ కారణంగానే ప్రజలు అప్పగించిన ప్రభుత్వాన్ని చేజేతులా కూల్చుకున్నారు. మధ్యప్రదేశ్ లో గతంలో సీనియర్ నేతలు కమల్ నాధ్, దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా ఉండేవారు.

ముగ్గురి కృషితోనే…?

గత అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురూ పడిన కష్టం ఫలితంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు ముందు దిగ్విజయ్ సింగ్ లేటు వయసులోనూ మూడు వేలకు పైగా పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్ర ఎఫెక్ట్ ఎంత వరకూ ఎన్నికల ఫలితాలపై పడింది అన్నది పక్కన పెడితే డిగ్గీరాజా ప్రభావం అనేక నియోజకవర్గాల్లో పనిచేసిందంటారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఉన్న బీజేపీపై కాంగ్రెస్ పట్టు సాధించడానికి సీనియర్ నేతల వ్యూహాలు, యువనేత జ్యోతిరాదిత్య సింధియా దూకుడు పనిచేశాయని చెప్పాలి.

అధికారంలోకి వచ్చాక….

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కమల్ నాధ్ ముఖ్యమంత్రి అయ్యారు. దిగ్విజయ్ సింగ్, కమల్ నాధ్ కలసి జ్యోతిరాదిత్య సింధియాను దూరం పెట్టారు. దీంతో సింధియా పార్టీని వీడి వెళ్లిపోయారు. ఫలితంగా మధ్యప్రదేశ్ లో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కమల్ నాధ్ ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి, ఎన్నికల పర్యవేక్షణకు ఆయన బాధ్యత వహించే అవకాశాలు లేవనే చెప్పాలి.

యాక్టివ్ గా లేకపోవడంతో….

సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సయితం రాజ్యసభ సభ్యుడిగానే ఉండిపోయారు. అప్పుడప్పుడు ట్విట్టర్ లో కన్పించడం తప్ప ఆయన కూడా పెద్దగా యాక్టివ్ గా లేరు. జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడి వెళ్లడంతో బీజేపీకి గతంలో కన్నా మధ్యప్రదేశ్ లో మరింత బలం పుంజుకుంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ కు సీనియర్ నేతలు ఏ మేరకు ఉపయోగపడతారన్నది ప్రశ్నార్థకంగానే మారింది. కొత్త నేత ఎంపిక జరుగుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News