బోసిపోయిందే…? బోరు కొట్టేసిందా?

ఎన్నికలంటే ఎలా ఉండాలి? పార్టీ కార్యాలయం ఎంత సందడిగా ఉండాలి? కానీ కాంగ్రెస్ లో మాత్రం ఆ సందడి కరువైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్ [more]

Update: 2020-11-27 00:30 GMT

ఎన్నికలంటే ఎలా ఉండాలి? పార్టీ కార్యాలయం ఎంత సందడిగా ఉండాలి? కానీ కాంగ్రెస్ లో మాత్రం ఆ సందడి కరువైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గాంధీ భవన్ బోసిపోయినట్లే కన్పిస్తుంది. టీఆర్ఎస్, బీజేపీల్లో టిక్కెట్లు దక్కని వారు కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగితే.. గాంధీ భవన్ లో మాత్రం టిక్కెట్ కోసం పోటీయే పెద్దగా లేకపోవడం విశేషం. గతంలో ఏ ఎన్నికల్లో ఈ పరిస్థితి లేదని కాంగ్రెస్ నేతలే అంగీకరిస్తున్నారు.

వరస ఓటములతో….

వరస ఓటములతో కాంగ్రెస్ పార్టీపై నేతలకు నమ్మకం లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా లేకపోవడం వల్లనే కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుంది. ఏ ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ సరైన పెరఫార్మెన్స్ చూపలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన హుజూర్ నగర్ నే కాంగ్రెస్ తిరిగి దక్కించుకోలేకపోయింది. ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో మూడో స్థానంలో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి కాంగ్రెస్ కు ఏర్పడింది.

పెద్దగా అంచనాలు లేక….

ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు పై పెద్దగా అంచనాలు లేవు. ఒకప్పుడు హైదరాబాద్ ను కాంగ్రెస్ పార్టీ శాసించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీని కూడా గతంలో దక్కించుకుంది. వైఎస్ హయాంలో కాంగ్రెస్ గెలిచి బండ కార్తీక్ రెడ్డి మేయర్ పదవిని అలంకరించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నేతలున్నా క్యాడర్ లేకుండా పోయారు. కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేయడానికే భయపడి పోయే పరిస్థితి ఏర్పడింది.

ఇస్తామన్నా…..

కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. పిలిచి టిక్కెట్ ఇస్తామన్నా ఎవరూ ముందుకు రాలేదు. గతంలో నాయకుల వద్ద పైరవీలు చేసి మరీ టిక్కెట్లు తెచ్చుకునే నేతలు ఇప్పుడు గాంధీభవన్ వైపు చూడటంలేదు. దీనికి ప్రధాన కారణం బీజేపీపై నమ్మకం కలగడమే. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని భావించిన నేతలు ఎక్కువమంది ఆ పార్టీవైపు వెళ్లారు. దీంతో గాంధీభవన్ ఎన్నికల వేళ కూడా బోసిపోయి కన్పిస్తుందంటున్నారు.

Tags:    

Similar News