Congress : సోనియా ఎందుకంత సీరియస్ అయ్యారు?

కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికలు కీలకం. ఈ ఎన్నికల్లో కనీస పనితీరును మెరుగుపర్చుకోకపోతే తమ పక్షాన ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా నమ్మే పరిస్థితి [more]

Update: 2021-10-16 16:30 GMT

కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికలు కీలకం. ఈ ఎన్నికల్లో కనీస పనితీరును మెరుగుపర్చుకోకపోతే తమ పక్షాన ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికే కాంగ్రెస్ తో నేరుగా జట్టు కట్టేందుకు ప్రాంతీయ పార్టీల భయపడే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ తో జట్టు కడితే తాము కూడా మసి అయిపోతామన్న ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం రావాలంటే వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతిభ కనపర్చాల్సిందే.

వారిని ఉద్దేశించే…

అందుకే ఈరోజు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సోనియా గాంధీ గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యవహరించారు. తాను చెప్పిందే వేదమని, తన మాటే శాసనసమని తెలిపారు. తాను పూర్తికాలపు అధ్యక్షురాలినని, ఇందులో అనుమానం లేదని తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడేవారిని సహించేది లేదని సోనియా గాంధీ కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. ఈ హెచ్చరికలు 23 మంది ఎదురు తిరిగిన నేతలను ఉద్దేశించేదనని అందరికీ తెలిసిందే.

మోదీ మాయలో కొందరు…

జీ 23 నేతలు కొందరు మోదీ మాయలో పడ్డారని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది. అసమ్మతి నేతల కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఎలాంటి అలజడులు సృష్టించకుండా, పార్టీని ఇబ్బంది పెట్టకుండా సోనియా గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని వాడుకున్నారు. ఏదైనా సమస్యలుంటే నేరుగా తనతో చర్చించవచ్చని, మీడియాకు ఎక్కవద్దని కూడా సోనియా కటువుగా అన్నారంటే ఆమె ఐదు రాష్ట్రాల ఎన్నికల మీద ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థమవుతుంది.

కఠిన చర్యలు తప్పవంటూ…

తన కుమార్తె, కుమారుడు పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్నా కొందరు నేతలు వెనక్కు లాగే ప్రయత్నాలు చేస్తున్నారని సోనియా గాంధీ భావిస్తున్నారు. అందుకే సమిష్టిగా పనిచేయాల్సిన సమయమిది అని నేతలకు సోనియా క్లాస్ పీకారు. పార్టీ విజయం కోసం పనిచేసిన వారికే భవిష‌్యత్ ఉంటుందని కూడా ఆమె చెప్పారు. మొత్తం మీద కాంగ్రెస్ హైకమాండ్ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చూపి వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి బలమైన కూటమికి బాటలు వేసుకోవాలన్న ప్రయత్నంలో ఉంది.

Tags:    

Similar News