కాంగ్రెస్ కే కలిసొస్తుందటగా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మరో వారం రోజులే గడువు ఉండటంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే ఇక్కడ ప్రధానంగా మోడీ, వర్సెస్ [more]

Update: 2020-01-29 17:30 GMT

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మరో వారం రోజులే గడువు ఉండటంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే ఇక్కడ ప్రధానంగా మోడీ, వర్సెస్ అరవింద్ కేజ్రీవాల్ మధ్య పోటీ జరుగుతుందన్న ప్రచారాన్ని ఇటు బీజేపీ అటు ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంటరిగా సెలెన్స్ గా తన క్యాంపెయిన్ ను నిర్వహిస్తుంది. అయితే కాంగ్రెస్ ను అంత తేలిగ్గా తీసిపారేయడానికి లేదు.

బలమైన అభ్యర్థులతో…

గత పార్లమెంటు ఎన్నికల ఫలితాలు చూస్తే ఇదే అర్థమవుతుంది. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచి ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో పెద్ద హడావిడి చేయడం లేదు. అలాగని నాన్ సీరియస్ గా కూడా లేదు. బలమైన అభ్యర్థులను అన్ని నియోజకవర్గాల్లో దించింది. అభ్యర్థులే విజయంలో కీలకంగా మారతారని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. అందుకే 70 నియోజకవర్గాల్లో అత్యథిక స్థానాల్లో ఆర్థిక, సామాజిక బలం ఉన్న నేతలనే అభ్యర్థులుగా పెట్టింది.

బీజేపీ, ఆప్ లు…..

కాంగ్రెస్ కు ఇది కలసి వస్తుందంటున్నారు. ఇటు బీజేపీ మోదీ నినాదంతోనూ, అటు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ఇమేజ్ తోనూ గెలవాలని భావిస్తుంది. నాయకత్వాన్ని, పార్టీని చూసి రాష్ట్రాల ఎన్నికల్లో ఓట్లు వేసే పరిస్థితి లేదు. పార్లమెంటు ఎన్నికల్లో కొంత ప్రభావం చూపినప్పటికీ శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులే కీలకంగా మారనున్నారు. సామాజికవర్గంతో పాటు తమకు అందుబాటులో ఉంటారన్న నమ్మకం ఉంటేనే ప్రజలు వారివైపు మొగ్గు చూపుతారు.

జంప్ చేసిన వారికి……

ఇప్పుడు కాంగ్రెస్ అదే పని చేసింది. కొంత బలహీనంగా ఉన్న చోట్ల ఇతర పార్టీల నేతలకు కండువా కప్పేసి టిక్కెట్లు ఇచ్చింది. చాందినీ చౌక్ నియోజకవర్గంలో ఆప్ నుంచి వచ్చి చేరిన అల్కాలంబా పోటీ పడుతున్నారు. ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేల అయిన ప్రహ్లాద్ సింగ్ ఆప్ నుంచి పోటీ చేస్తుండటం విశేషం. ద్వారకా నియోజకవర్గంలో ఆప్ రెబెల్ ఎమ్మెల్యే ఆదర్శ్ శాస్త్రి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ఆప్ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన వినయ్ మిశ్రా బరిలో ఉన్నారు. ఇలా కొత్త ముఖాలు కాకపోయినా ప్రత్యర్థులకు కండువా కప్పేసి మరీ టిక్కెట్లు ఇచ్చారు. ఇలా ఢిల్లీలో కాంగ్రెస్ అనేక చోట్ల బలమైన అభ్యర్థులను రంగంలోకి దించిందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. సీఏఏ వ్యతిరేకత కూడా కాంగ్రెస్ కు కలిసి వస్తుందంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News