Congres : ఎవరితో కుదురుగా ఉండలేదు కదా?

కాంగ్రెస్ పార్టీ ఎవరితో కుదురుగా ఉండలేదు. తమకు నమ్మకమైన మిత్ర పక్షాలనే వదులుకుంటుంది. పార్టీలో కొంత వాయిస్ ఉన్న నాయకులను దూరం చేసుకుంది. ఫలితంగా వారే అనేక [more]

Update: 2021-10-29 16:30 GMT

కాంగ్రెస్ పార్టీ ఎవరితో కుదురుగా ఉండలేదు. తమకు నమ్మకమైన మిత్ర పక్షాలనే వదులుకుంటుంది. పార్టీలో కొంత వాయిస్ ఉన్న నాయకులను దూరం చేసుకుంది. ఫలితంగా వారే అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పెట్టి కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారారు. ఇన్ని అనుభవాలున్నా కాంగ్రెస్ కు మాత్రం ఇంకా బుద్ధి రావడం లేదు. తాజాగా బీహార్ లోనూ కాంగ్రెస్ తన మిత్రపక్షమైన రాష్ట్రీయ జనతాదళ్ ను ఇబ్బంది పెట్టింది. ఇప్పడు ఆర్జేడీ కూడా హ్యాండ్ ఇస్తే ఇక ఆ రాష్ట్రంలో దిక్కు మొక్కూ ఉండదు.

ఆర్జేడీ బలంగా ఉన్నా…

బీహార్ లో ఆర్జేడీ కూటమిలో కాంగ్రెస్ ఒక పార్టీగా ఉంది. అక్కడ బలమైన ప్రాంతీయ పార్టీగా రాష్ట్రీయ జనతాదళ్ పేరు తెచ్చుకుంది. లాలూ ప్రసాద్ యాదవ్ కాలం నుంచే ఆర్జేడీ ఇక్కడ బలమైన పునాదులు ఏర్పరచుకుంది. కొంతకాలం క్రితం జరిగిన బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీతో కలసి పోటీ చేసింది. 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం ఇరవై స్థానాల్లోనే గెలవగలిగింది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించినా కాంగ్రెస్ చూపిన నీరసమైన పెరఫార్మెన్స్ తో తేజస్వి యాదవ్ సీఎం పీఠానికి దూరమవ్వాల్సి వచ్చింది.

కాంగ్రెస్ కు దూరంగా….

బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ ను దాని మిత్ర పక్షాలు దూరంగానే ఉంచుతున్నాయి. తమిళనాడులోనూ డీఎంకే కొద్ది స్థానాలను మాత్రమే ఇచ్చి అధికారంలోకి రాగలిగింది. కాంగ్రెస్ కు ఇంతకంటే దరిద్రమైన పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పడు అదే బీహార్ లో ఆర్జేడీని దూరం చేసుకునేలా ఆపార్టీ వ్యవహరిస్తుండటం చర్చనీయాంశమైంది. బీహార్ లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

ఉప ఎన్నికలతో….

బీహార్ లోని కుశేశ్వర్ స్థాన్, తారాపూర్ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ఆర్జేడీని కాదని పోటీ చేస్తుంది. కుశేశ్శర స్థాన్ నియోజకవర్గం గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ కు వెళ్లింది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలు కావడంతో ఇప్పుడు ఆర్జేడీ తన అభ్యర్థిని నిలబెట్టింది. దీనిపై ఆగ్రహించిన కాంగ్రెస్ కుశేశ్వర్ స్థాన్ తో పాటు, తారాపూర్ స్థానాలకు కూడా తన అభ్యర్థులను బరిలోకి దించింది. దీంతో బీహార్ లో రెండు పార్టీల మధ్య స్నేహం చెడిందనే అనుకోవాలి. మరోవైపు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాము 40 అసెంబ్లీ లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తామని బీహార్ కాంగ్రెస్ చీఫ్ భక్త్ చరణ‌్ దాస్ ప్రకటించడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News