Badvel : బద్వేల్ లో కాంగ్రెస్ గేమ్ ప్లాన్ ఇదేనట

బద్వేలులో నామినేషన్ పర్వం ముగిసింది. 35 మంది వరకూ నామినేషన్లు వేసినా పోటీ మాత్రం మూడు పార్టీల మధ్యనే ఉండనుంది. అయితే విచిత్రం ఏంటంటే ఇక్కడ జాతీయ [more]

Update: 2021-10-16 09:30 GMT

బద్వేలులో నామినేషన్ పర్వం ముగిసింది. 35 మంది వరకూ నామినేషన్లు వేసినా పోటీ మాత్రం మూడు పార్టీల మధ్యనే ఉండనుంది. అయితే విచిత్రం ఏంటంటే ఇక్కడ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు తమ ఆధిక్యతను నిలుపుకునేందుకు పోటీ పడుతున్నాయి. బద్వేలు లో వైసీపీ విజయం ఏకపక్షమే. అది అందరికీ తెలిసిందే. బీజేపీని రాష్ట్రంలో నిలువరించాలంటే తాము ఈ ఎన్నికల్లో ఆ పార్టీ కంటే ఎక్కువ ఓట్లు సాధించాలని కాంగ్రెస్ భావిస్తుంది.

వారిని రప్పించి….

ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస పార్టీ కంటే, విభజన హామీలు అమలుచేయని బీజేపీపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను కూడా బద్వేలు ఉప ఎన్నిక ప్రచారానికి రప్పించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రచారానికి వస్తే పోటీలో లేని టీడీపీ ఓట్లు తమకు అనుకూలంగా పడతాయన్నది కాంగ్రెస్ గేమ్ ప్లాన్ గా కన్పిస్తుంది.

అభ్యర్థి పరంగా….

అభ్యర్థుల పరంగా చూసుకున్నా బీజేపీ అభ్యర్థి కంటే కాంగ్రెస్ అభ్యర్థి బలంగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ గతంలో ఎమ్మెల్యేగా పనిచేయడం, ఆమెకంటూ కొంత ఓటు బ్యాంకు ఉండటం కలసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. కమలమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను చేసిన అభివృద్ధి పనులు తనకు ఓట్లు తెచ్చి పెడతాయని ఆశిస్తున్నారు. టీడీపీ స్థానిక నాయకత్వం కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు.

కాంగ్రెస్ కే అండగా…..

వచ్చే ఎన్నికల్లో ఎటొచ్చి ఎలా ఉండబోతుందో ఎవరూ చెప్పలేరు. బీజేపీ, జనసేన కలసి తిరిగి ఇప్పటి అభ్యర్థినే అప్పుడు పోటీకి దింపవచ్చు. ఆ సమయంలో కాంగ్రెస్ అయితే బలహీనంగా ఉంది. కోలుకోలేదు. అదే బీజేపీకి ఓటు బ్యాంకు ఒకసారి అలవాటు పడితే కష్టమని టీడీపీ స్థానిక నాయకత్వం భావిస్తుంది. దీంతో లోపాయికారీగా కాంగ్రెస్ కే మద్దతివ్వాలని టీడీపీ నిర్ణయించినట్లు చెబుతున్నారు. దీంతో ఇక్కడ బీజేపీ కంటే కాంగ్రెస్ కే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశముందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Tags:    

Similar News