Congress : ఆయనపైనే ఆశలు.. ఆయన ఒప్పుకుంటారా?

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పొత్తులకు సిద్ధమవుతుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కలసి ప్రయాణించాలని భావిస్తుంది. చంద్రబాబు బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. అది బెడిసి కొడితే [more]

Update: 2021-11-12 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పొత్తులకు సిద్ధమవుతుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కలసి ప్రయాణించాలని భావిస్తుంది. చంద్రబాబు బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. అది బెడిసి కొడితే తాము టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తుంది. అందుకే ప్రతి ఉప ఎన్నికల్లోనూ పోటీ చేసి తమ ఓటు బ్యాంకును చెప్పే ప్రయత్నం చేసిందంటున్నారు. బీజేపీతో పొత్తు చంద్రబాబుకు కుదరకపోతే తాము కలసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలను పంపుతుంది.

అందుకే పోటీ….

తిరుపతి ఉప ఎన్నిక, బద్వేలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అందుకే ధీటైన అభ్యర్థులను పోటీ చేయించింది. తిరుపతిలో మాజీ ఎంపీ చింతామోహన్, బద్వేలులో మాజీ ఎమ్మెల్యే కమలమ్మను బరిలోకి దింపింది. అయితే ఓట్ల శాతం పెద్దగా లేకున్నా ప్రభావం చూపే స్థాయిలో తాము ఉన్నామని కాంగ్రెస్ చెబుతోంది. తమతో టీడీపీ కలిస్తే దళిత, మైనారిటీ ఓట్లతో పాటు రెడ్డి సామాజికవర్గం ఓట్లు కూడా వచ్చే అవకాశముందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పీసీసీ చీఫ్ ను మార్చి….

రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో ఉనికి కోల్పోయింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు దాదాపు జీరో అయిందనే చెప్పాలి. ఆ ఓటు బ్యాంకు మొత్తం వైసీపీ వైపు మరలింది. అయితే గత రెండు ఎన్నికల్లో శాసనసభలో ప్రాతినిధ్యం లేకుండా పోవడంతో ఈసారి పొత్తులతోనే వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందుకు పార్టీ కేంద్ర నాయకత్వం కూడా కసరత్తులు ప్రారంభించింది. పీసీసీ చీఫ్ ను మార్చి రెడ్డి సామాజికవర్గం నేతకు అప్పగించాలని భావిస్తుంది.

బాబుతో పొత్తు కోసం….

రెడ్డి సామాజికవర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ ప్రయోగాన్ని చేయాలని నిర్ణయించింది. దీంతో చంద్రబాబు నిర్ణయంపైనే కాంగ్రెస్ భవిష్యత్ ఆధారపడి ఉంది. కాంగ్రెస్ ఒంటరిగా 175 నియోజకవర్గాల్లో పోట ీచేసే శక్తి, సామర్థ్యం లేకపోవడంతో చంద్రబాబుపైనే ఆశలు పెట్టుకుంది. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నా, సైకిల్ పార్టీ పొత్తు అవసరమని భావిస్తుంది. అందుకే ఇటీవల టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంపై జరిగిన దాడులను ఖండించడమే కాకుండా, పార్టీ నేతలు కార్యాలయాన్ని సందర్శించారు.

Tags:    

Similar News