రిమోట్ కంట్రోల్ గుప్పిట్లో….!!!

కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో సనాతమైన పార్టీ. ఆ పార్టీ రాజకీయాల్లో ఏం చేయవచ్చో అన్నీ చేసి చూపించింది. ప్రజాస్వామ్యం ఇచ్చిన స్వేచ్చను ఓ రాజ‌కీయ పార్టీగా [more]

Update: 2019-07-04 18:29 GMT

కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో సనాతమైన పార్టీ. ఆ పార్టీ రాజకీయాల్లో ఏం చేయవచ్చో అన్నీ చేసి చూపించింది. ప్రజాస్వామ్యం ఇచ్చిన స్వేచ్చను ఓ రాజ‌కీయ పార్టీగా ఎలా వాడుకోవచ్చో కాంగ్రెస్ కి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. తరువాత కాలంలో కాంగ్రెస్ విధానాలను విమర్శించిన వారే తాము పగ్గాలు చేపట్టాక వాటినే అనుసరించడం కాంగ్రెస్ ఒరవడి ఎంత బలంగా ఉంటుందో చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమే. ఈదేశంలో కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు, రిమోట్ కంట్రోల్ పాలిటిక్స్ ఇవన్నీ కాంగ్రెస్ కనుగొని దేశానికి అందించిన వరాలే. రాహుల్ గాంధీ రాజీనామా తర్వాత మళ్లీ ఈ చర్చ నడుస్తోంది.

ప్రధానిని కంట్రోల్ చేసిన చరిత్ర….

నెహ్రూ హయాంలో దేశంలో కొంత ప్రజాస్వామిక వాతావరణం ఉండేది. పార్టీలో కూడా అది కనిపించేది. ఇక ఇందిర హయాంలో ముఖ్యమంత్రులను వెంట తిప్పుకోవడం, వారిని కట్టు బానిసలుగా మార్చడం జరిగింది. ఓ విధంగా ఢిల్లీ నుంచి వారిని శాసించేది, పాలించేది. ఇక ఆమె కోడలు సోనియా గాంధి నాలుగాకులు ఎక్కువే చదివారు. ఆమె ఏకంగా ప్రధానినే రిమోట్ కంట్రోల్ ద్వారా నియత్రించారు. 2004 నుంచి 2014 వరకూ ఈ దేశాన్ని పాలించిన మన్మోహన్ సింగ్ గాంధి కుటుంబం మాట జవదాటలేదు. అసలు నిర్ణయాలు వారివి. అమలు పరచడం మన్మోహన్ ది. ఓ దేశ ప్రధాని చేసిన నిర్ణయాన్ని చిత్తు కాగితం ముక్కతో సమానం చేసిన రాహుల్ గాంధి జమానాను కూడా అప్పుడే ఈ దేశం చూసింది.

అధ్యక్షుడు నామమాత్రం…

కాంగ్రెస్ లో ఇపుడు జరుగుతున్న రాహుల్ గాంధీ రాజీడ్రామా జనానికి విసుగు పుట్టిస్తోంది. ఆ పార్టీ పూర్తిగా గాంధీ కుటుంబానికి అంకితమై దశాబ్దాల కాలం గడచిపోయింది. ఆ ఇంటి వారు ఎవరైనా కావచ్చు. భుజానకెత్తుకుని మోస్తామన్ని భజన భక్తులు నిండా ఉన్న పార్టీ కాంగ్రెస్. ఇపుడు హఠాత్తుగా రాహుల్ గాంధీ తాను పార్టీ పగ్గాలు వదిలేస్తున్నానని చెప్పినా కూడా ఎవరైనా నమ్ముతారా. అధికారాలు మొత్తం కొత్త అధ్యక్షుడికి దఖలు పడతాయా. ఇప్పటికీ రాహుల్, సోనియా గాంధిలే తెర వెనక పాత్రధారులు, సూత్రధారులు. తాజా ఎన్నికల్లో గాంధీ కుటుంబాన్ని గట్టిగా మోడీ దునుమాడిన నేపధ్యంలో తాము పక్కకు తప్పుకుంటామని చెబుతూ జనంలో సానుభూతి కోసం వేసిన ఎత్తుగడగా దీన్ని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఇపుడు కాంగ్రెస్ కి దేశంలో అధికారం లేదు కాబట్టి పార్టీ అధ్యక్షుడినే రిమోట్ తో కంట్రోల్ చేస్తారన్న మాట. ఇదో సరదా మరి.

Tags:    

Similar News