మనస్పర్థలు మొదలయ్యాయా?

మహారాష్ట్రలో కూటమి సర్కార్ కు ఎప్పుడైనా ముప్పు వాటిల్లే అవకాశముంది. అసలే మంత్రి వర్గ విస్తరణతో అసంతృప్తులు చెలరేగి పార్టీలు సతమతమవుతుంటే కొత్తగా పార్టీల మధ్య మనస్పర్థలు [more]

Update: 2020-01-04 18:29 GMT

మహారాష్ట్రలో కూటమి సర్కార్ కు ఎప్పుడైనా ముప్పు వాటిల్లే అవకాశముంది. అసలే మంత్రి వర్గ విస్తరణతో అసంతృప్తులు చెలరేగి పార్టీలు సతమతమవుతుంటే కొత్తగా పార్టీల మధ్య మనస్పర్థలు చోటు చేసుకుంటున్నాయి. సావర్కర్ వివాదం కాంగ్రెస్, శివసేనల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయి. కాంగ్రెస్ సావర్కర్ విషయంలో అవలంబిస్తున్న వ్యవహారశైలిని శివసేన బహిరంగంగానే తప్పుపడుతోంది.

సావర్కర్ పై…..

ఇటీవల కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ లు కలసి మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన సేవాదళ్ విడుదల చేసిన ఒక పుస్తకం వివాదాస్పదమయింది. ఇందులో సావర్కర్ ను వ్యంగంగానూ, విమర్శనాత్మకంగానూ చేసిన వ్యాఖ్యలను శివసేన తీవ్రంగా పరిగణిస్తోంది. వీర సావర్కర్ వీరత్వం ఎంత? అంటూ ప్రవ్నించడంపై కాంగ్రెస్ పార్టీపై శివసేన మండిపడుతోంది.

డబ్బులు తీసుకున్నారంటూ….

మధ్యప్రదేశ్ లో సేవాదళ్ ఒక పుస్తకం విడుదల చేసింది. ఈ పుస్తకంలో సావార్కర్, నాథూరాం గాడ్సే ల మధ్య శారీరీక సంబంధం ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా కొన్ని కఠినమైన వ్యాఖ్యలు కూడా ఈ పుస్తకంలో చేయడం విశేషం. సావర్కర్ అండమాన్ జైలు నుంచి విడుదలైన తర్వాత బ్రిటీష్ ప్రబుత్వం నుంచి డబ్బులు తీసుకున్నారని తీవ్ర ఆరోపణలను ఈ పుస్తకంలో ముద్రించింది. దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మండిపడుతున్న శివసేన…

కాంగ్రెస్ నోటిని, చేతిని అదుపులో పెట్టుకోవాలని సూచించారు. సావర్కర్ వీరత్వం గురించి వారికేమి తెలుసునని కటువుగా వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో సావర్కర్ అంటే అభిమానం, గౌరవం ఉంది. సావర్కర్ ను కాంగ్రెస్ అగౌరవపరిస్తే అది పరోక్షంగా శివసేనకు దెబ్బే అవతుంది. అందుకే గతంలోనూ రాహుల్ గాంధీ నేనేమీ రాహుల్ సావర్కర్ ను కాదు, రాహుల్ గాంధీని అంటూ చేసిన వ్యాఖ్యలను కూడా అప్పటికప్పుడే శివసేన ఖండించింది. ఈ వివాదం సద్దుమణగకముందే కాంగ్రెస్ మరోసారి సావర్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పుస్తకం విడుదదల చేయడంపై శివసేన అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మరి సావర్కర్ కొట్లాట ఎంతవరకూ వెళుతుందో చూడాలి.

Tags:    

Similar News