వయసు ఎంతైతే ఏం….?

ఆమె వయస్సు 87 ఏళ్ళు. అయినా 17 ఏళ్ళ టీనేజ్ అమ్మాయికి వుండే హుషారు ఆమె సొంతం. ప్రపంచ కప్ లో ఈ బామ్మ భామ హాట్ [more]

Update: 2019-07-03 01:54 GMT

ఆమె వయస్సు 87 ఏళ్ళు. అయినా 17 ఏళ్ళ టీనేజ్ అమ్మాయికి వుండే హుషారు ఆమె సొంతం. ప్రపంచ కప్ లో ఈ బామ్మ భామ హాట్ టాపిక్ అయ్యారు. చారులత పాటిల్ చక్రాల కుర్చీలో ఇండియా – బంగ్లాదేశ్ మ్యాచ్ తిలకించేందుకు స్టేడియం కి వచ్చారు. వచ్చిన ఆవిడ తిన్నంగా కూర్చుందా అంటే లేనేలేదు . బుగ్గలపై భారత త్రివర్ణ పతాకం పెయింట్ కొట్టించుకుని చేతిలో బూర పట్టుకుని ఊదుతూ టీం ఇండియా విజయాన్ని ఆకాంక్షించారు. మ్యాచ్ మొత్తం బామ్మ చేసిన హడావిడినే టివి కెమెరాలు మధ్య మధ్యలో షూట్ చేస్తూ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించాయి. ఎంతో జోష్ తో ఆమె ఇచ్చిన సపోర్ట్ అందరిలో మరింత హుషారును ప్రోది చేసింది.

సోషల్ మీడియా స్టార్ అయిపోయిన బామ్మ …

వయస్సుతో నాకు సంబంధం లేదు నా మనసు చెప్పినట్లే నడుచుకుంటా అనే రీతిలో చెలరేగిన చారులత స్టేడియం మొత్తాన్నే కాదు యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా బామ్మ చేసిన హడావిడి ఆమె చిత్రాలు వీడియోలతో నిండిపోయాయి. వైరల్ న్యూస్ ఐటెం గా చారులత మారిపోయారు.

చారులతను కలిసిన కోహ్లీ ..

టీం ఇండియా హార్డ్ కొర్ ఫ్యాన్ చారులతను కెప్టెన్ విరాట్ కోహ్లీ , వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ లు కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ చిత్రాలు కూడా ఇప్పుడు వైరల్ అయ్యాయి. భారత విజయపరంపర ఇలాగే కొనసాగాలని టీం ఇండియా కప్ గెలవాలని చారులత ఆటగాళ్లకు దీవెనలు అందించారు. ఆమె కోరుకున్నట్లే బంగ్లాదేశ్ పై ఘనవిజయాన్ని అందుకున్న టీం ఇండియా నేరుగా సెమిస్ కు దూసుకువెళ్లి ఆమె అంచనాలను నిజం చేసింది.

Tags:    

Similar News