వావ్…ఇలా ఆడితే ఇంకేముంది…?

ప్రపంచ క్రికెట్ కప్ కి టీం ఇండియా సన్నద్ధమైన తీరు మంచి ఫలితాలనే ప్రస్తుతానికి ఇస్తుంది. జట్టు గా ఆడటం అంటే ఏమిటో ప్రత్యర్థులకు రుచి చూపించి [more]

Update: 2019-06-10 02:00 GMT

ప్రపంచ క్రికెట్ కప్ కి టీం ఇండియా సన్నద్ధమైన తీరు మంచి ఫలితాలనే ప్రస్తుతానికి ఇస్తుంది. జట్టు గా ఆడటం అంటే ఏమిటో ప్రత్యర్థులకు రుచి చూపించి వరుసగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా లకు చుక్కలు చూపించేసింది భారత్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో తమదైన రీతిలో రాణించడం ఈ అద్భుత విజయాలకు కారణం. ప్రపంచ అత్యుత్తమ జట్లు గా వున్న సౌత్ ఆఫ్రికా, ఆసీస్ పై వరుస గా విజయాలు సాధించడం చిన్న విషయం కాదు. అలాగే మ్యాచ్ రోజు అత్యున్నత ప్రదర్శన విజయాన్ని ఏ జట్టునైనా వరించేలా చేస్తుంది. లీగ్ దశలో చిన్నా పెద్దా తేడా లేకుండా ఇదే ఆటతీరును చూపించాలి. కోహ్లీ సేన అదే పనిలో బిజీగా వుంది.

సమపాళ్లలో వున్న టీం ఇండియా …

ఒక పక్క అనుభవజ్ఞులు. మరో పక్క యువకులతో కూడిన టీం ఇండియా ప్రపంచ కప్ స్క్వాడ్ ప్రత్యర్థులకు దడపుట్టిస్తుంది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కోహ్లీ, ధోని, హార్దిక్ పాండ్య కేదార్ జాదవ్ లతో బ్యాటింగ్ లైనప్ భువనేశ్వర్, చాహల్, బుమ్రా, కులదీప్ లతో బౌలింగ్ విభాగం చక్కని సమన్వయంతో సాగుతుంది. ఇక మాజీ కెప్టెన్ ధోని, ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ లతో కోచ్ రవిశాస్త్రి కాంబినేషన్ హుషారుగా నడుస్తుంది.

విభిన్న వ్యూహాలతో…..

మ్యాచ్ మ్యాచ్ కి ప్రత్యర్థి టీం పై తమదైన వ్యూహంతోనే బరిలోకి దిగి ఆ ప్లాన్ పూర్తిగా అమల్లో పెట్టి సెక్సెస్ కొడుతోంది టీం ఇండియా. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో ఒక వ్యూహాన్ని, ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో మరో వ్యూహాన్ని అమలు చేసిన తీరు గమనిస్తే ఎప్పటికప్పుడు టీం ఇండియా తన ప్రత్యర్థుల ఊహలకు అందని వ్యూహాలను రెడీ చేస్తూ సాగడం విశేషం. 130 కోట్ల భారతీయలు ఆకాంక్షలను వత్తిడి గా తీసుకోకుండా తమదైన ఆటశైలితో దూసుకుపోతున్న టీం ఇండియా ఇప్పుడు ప్రపంచ కప్ హాట్ ఫెవరెట్ టీం లలో ఒకటి కావడం విశేషం.

Tags:    

Similar News