టీం ఇండియా జెర్సీ పై రాజకీయ రంగుపడిందే ?

ప్రపంచ కప్ లో టీం ఇండియా జెర్సీ పై రాజకీయ రంగు పడింది. మెన్ ఇన్ బ్లూ గా వరల్డ్ కప్ జెర్సీ తో బరిలోకి దిగింది [more]

Update: 2019-06-30 12:21 GMT

ప్రపంచ కప్ లో టీం ఇండియా జెర్సీ పై రాజకీయ రంగు పడింది. మెన్ ఇన్ బ్లూ గా వరల్డ్ కప్ జెర్సీ తో బరిలోకి దిగింది టీం ఇండియా. అయితే ఐసిసి నిబంధనల ప్రకారం దగ్గర దగ్గరగా వుండే రంగులతో కూడిన జెర్సీలు రెండు జట్లకు ఉండకూడదు. దాంతో ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ కి భారత్ జెర్సీ మార్చక తప్పదు. ఆతిధ్య జట్టు తమ జెర్సీ కొనసాగించుకోవొచ్చు. దాంతో టీం ఇండియా కొత్త జర్సీని ప్రధాన స్పాన్సర్ నైకీ ఆరెంజ్ విత్ బ్లూ గా తయారు చేసింది.

ఇక్కడ కాషాయమే ….

అయితే తాజా జెర్సీ పై భారత్ లోని రాజకీయ పార్టీలు విమర్శలు మొదలు పెట్టాయి. బిజెపి తమ కాషాయాన్ని టీం ఇండియా పై కూడా రుద్దడం ఏమిటంటూ దాడి మొదలు పెట్టాయి. కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు మోడీ సర్కార్ అన్నిటా తమ ముద్ర చాటుతుందని ఆరోపించాయి. అయితే జెర్సీని వివాదం చేయడం సరికాదని క్రీడాభిమానులు, సీనియర్ క్రీడాకారులు అంటున్నారు. ప్రతీది రాజకీయ కోణంలో చూడటం సరికాదని వారు హితవు పలుకుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు మెన్ ఇన్ బ్లూ గా చూడముచ్చటైన జెర్సీలో కనువిందు చేసే టీం ఆరంజ్ జెర్సీలో న్యూ లుక్ తో అదరగొడుతుండటం విశేషం.

Tags:    

Similar News