మూడో స్టేజ్ కి పోకుండా ఉండాలంటే …?

కరోనా వైరస్ ప్రభావం తో భారత్ రెండో దశలో ఉంది. ఇది మూడో దశకు చేరితే దేశం ప్రమాదంలో పడుతుంది. ఈ దశకు రాకూడదనే భారత ప్రధాని [more]

Update: 2020-03-25 11:00 GMT

కరోనా వైరస్ ప్రభావం తో భారత్ రెండో దశలో ఉంది. ఇది మూడో దశకు చేరితే దేశం ప్రమాదంలో పడుతుంది. ఈ దశకు రాకూడదనే భారత ప్రధాని దేశం అంతా లాక్ డౌన్ ప్రకటించారు. దీనితో సమస్య తీరుతుందా అంటే లేదనే చెప్పాలి. 130 కోట్ల ప్రజలు ఉన్న దేశం లో ఎన్ని ఆంక్షలు పెట్టినా అమలు అవుతాయా అంటే ప్రశ్నార్ధకమే. ప్రభుత్వాలు ఇచ్చే హెచ్చరికలను కొందరు పెడచెవిన పెడుతూ విచ్చలవిడిగా సంచరించడం ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. వీరు కాక రెక్కాడితే కానీ డొక్కాడని జీవులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. దాంతో కరోనా వ్యాప్తిని ఎంత అణచివేయాలని చూసినా కేసులు పెరుగుతూ పోతున్నాయి.

వద్దంటే జాతర చేస్తున్నారు….

మరో 21 రోజుల పాటు ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరికలు ఉన్నా ప్రజలు రోడ్లపైకి రావడానికి కారణం నిత్యావసరాల కోసమే. అయితే కాయగూరలు, కిరాణా, పాలప్యాకెట్లు వంటి వాటి కోసం ఉదయం సమయంలో మూడు నాలుగు గంటలు సమూహాలుగా ఏర్పడి అనేక చోట్ల జన యుద్ధాలు జనతా కర్ఫ్యులో కనిపిస్తున్నాయి. ఇది లాక్ డౌన్ లక్ష్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుంది. దీన్ని అరికట్టేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మైదాన ప్రాంతాల్లో నిత్యావసర సరకుల పంపిణి జరిగేలా చర్యలు తీసుకుంటున్నాయి. అక్కడ కూడా జాతర మాదిరే జనం గుమి కూడుతున్నారు.

ఇలా చేస్తే కంట్రోల్ అవుతుంది ….

విచ్చలవిడిగా జనం సంచరించకుండా పలు సూచనలు చేస్తున్నారు మేధావులు. ప్రతి కిలోమీటర్ దాటి వెళ్లకుండా ఎక్కడికక్కడ పోలీసులు చెక్ పాయింట్లు ఏర్పాటు చేయాలి అని సూచించారు బిసి రాయ్ అవార్డు గ్రహీత డా. కర్రి రామా రెడ్డి. ప్రజలు రోడ్లపైకి రాకుండా పూర్తిగా నిరోధించాలంటే నగరాలు, పట్టణాలు, మేజర్ పంచాయితీల్లో ప్రయివేట్ స్కూల్ బస్సులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని స్థానిక నిత్యావసర వస్తువులు అమ్మే వారితో ప్రాంతాల వారీగా ఏర్పాటు చేయాలి. ధరలు అధికంగా లేకుండా అధికారుల పర్యవేక్షణ తో ప్రతి ఇంటికి నిత్యావసరాలు కొనుగోలు చేసే సమయాన్ని కేటాయించి సోషల్ డిస్టెన్స్ జరిగేలా పర్యవేక్షిస్తుండాలి. సరుకుల కొరత లేదని ప్రతి నాలుగు వీధులకు పాలు, కిరాణా, కూరగాయలు, మందులు ఇలా అందుబాటులోకి తీసుకురావాలి అంటున్నారు రామా రెడ్డి వంటివారు.

Tags:    

Similar News