భారత్ కు వారితోనే పొంచి ఉన్న ముప్పు …?

కరోనా వైరస్ కట్టడి లో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. దేశం మొత్తం ఏకతాటిపై నిలిచి కరోనా పై పోరాడుతుంది. కేసుల సంఖ్య దేశంలో పెరుగుతున్నా [more]

Update: 2020-04-13 08:00 GMT

కరోనా వైరస్ కట్టడి లో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. దేశం మొత్తం ఏకతాటిపై నిలిచి కరోనా పై పోరాడుతుంది. కేసుల సంఖ్య దేశంలో పెరుగుతున్నా ప్రపంచ దేశాలతో పోలిస్తే మాత్రం 135 కోట్ల జనాభాకు అవి తక్కువనే చెప్పాలి. ఇలాంటి దశలో దేశంలో అమలు అవుతున్న లాక్ డౌన్ అమలుపై భిన్న వాదనలు సాగుతున్నాయి. నిబంధనలు సడలించి ఎకానమీ ని కాపాడుకోవాలని కొందరు లాక్ డౌన్ కొనసాగించకపోతే మొత్తం ఇప్పటివరకు చేసిన శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అవుతుందన్న వాదన వుంది.

వేచి చూడకుండా…..

అందుకే కేంద్రం నిర్ణయం కోసం వేచి చూసే ధోరణికి స్వస్తి పలికి ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాలు ఈనెల 30 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తూ నిర్ణయం తీసేసుకున్నాయి. వాస్తవానికి ఒడిశా లో దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పెద్దగా కేసులు లేవు. అయినా ఆ రాష్ట్రం కరోనా వ్యాప్తికి లాక్ డౌన్ మాత్రమే మంత్రం గా భావించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. వెనకబడిన ప్రాంతమైనా సమయోచితమైన నిర్ణయం తీసుకుంది.

హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ…

ప్రస్తుత దశలో భారత్ లాక్ డౌన్ సమర్ధంగా నిర్వహించకపోతే ప్రమాదమే అంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దీనికి కారణాలు కూడా చెబుతుంది. దేశంలో అసంఘటిత రంగంలో ఉన్న వలసకూలీలు కరోనా వైరస్ క్యారియర్స్ గా మారుతారన్న ఆందోళన ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యక్తం చేస్తుంది. తద్వారా ఇప్పటివరకు నగరాలు పట్టణాలకే పరిమితం అయిన వైరస్ గ్రామాలకు చేరుతుందని హెచ్చరిస్తుంది. ఈ హెచ్చరికలే ఇప్పుడు పాలకులను ముందుకు వెళ్ళేలేని పరిస్థితిని వెనక్కి రాలేని స్థితిని కల్పించాయి. ఆదివారమే లాక్ డౌన్ కొనసాగింపు పై ప్రధాని ఒక ప్రకటన చేస్తారని ప్రచారం జరిగినా మరిన్ని వర్గాలతో కేంద్రం సమాలోచనలు చేసిన అనంతరమే నిర్ణయం తీసుకోవడం మంచిదన్న యోచనతో ముందుకు సాగుతుంది.

Tags:    

Similar News