ఇంకా ఎంతో సమయం పట్టదట

భారత్ కరోనా వైరస్ తో అల్లాడి పోతుంది. ఇతర దేశాల సరసన చేరిపోయినట్లే కన్పిస్తుంది. ఇప్పటికే నాలుగు లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరికొద్ది [more]

Update: 2020-06-24 18:29 GMT

భారత్ కరోనా వైరస్ తో అల్లాడి పోతుంది. ఇతర దేశాల సరసన చేరిపోయినట్లే కన్పిస్తుంది. ఇప్పటికే నాలుగు లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరికొద్ది రోజుల్లోనే ఐదు లక్షలు దాటే అవకాశముంది. జులై చివరి నాటికి పదిహేను లక్షలకు కరోనా కేసులు చేరుతాయని నిపుణులు అంచనా వేశారు. అనేక సంస్థలు కూడా ఇదే చెబుతున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని రాష్ట్రాలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ ను విధించుకుంటున్నాయి.

లాక్ డౌన్ విధించడంతో…..

మార్చి నెలలో కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించింది. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం భారత్ లో లాక్ డౌన్ విధించింది. లాక్ డౌన్ తో కేసుల సంఖ్య తగ్గుతాయని, 14 రోజుల్లో వైరస్ చనిపోతుందని ప్రకటించింది. దీంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. దాదాపు నెల రోజుల పాటు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. స్వచ్ఛందంగా వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. కేంద్ర ప్రభుత్వం ఊహించినట్లే కరోనా కేసులు ప్రతి రోజూ తక్కువగా నమోదయ్యేవి.

మినహాయింపుల తర్వాత….

రెండు మూడు రాష్ట్రాలు మినహా కరోనా కేసులు పెద్దగా నమోదయ్యేవి కావు. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఊపిరిపీల్చుకుంది. అయితే రాష్ట్రాల ఆదాయం గణనీయంగా తగ్గిపోవడం, కేంద్రంపై వత్తిడి పెరగడంతో లాక్ డౌన్ లో ప్రభుత్వం మినహాయింపులు ఇస్తూ వచ్చింది. మూడో విడత లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచే భారత్ లో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి.

ఎనిమిది రోజుల్లోనే……

భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరుకోవడానికి 109 రోజుల సమయం పట్టింది. ఇక రెండు రోజులు చేరుకోవడానికి పదిహేను రోజుల సమయమే తీసుకుంది. మూడు లక్షలు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరుకోవడానికి పది రోజుల సమయమే పట్టింది. నాలుగు లక్షల అంకెకు చేరుకోవాడనికి పట్టిన సమయం కేవలం ఎనిమిది రోజులే కావడం గమనార్హం. దీనిని బట్టి నిపుణులు చెప్పినట్లు పదిహేను లక్షలు జులై రెండు లేదా మూడో వారానికి కరోనా కేసులు చేరుకునే అవకాశముందంటున్నారు. మొత్తం మీద భారత్ లో కరోనా వ్యాప్తి ఆందోళన కల్గిస్తుంది.

Tags:    

Similar News