అండర్ డాగ్ హడల కొట్టింది … ఓడినా మనసు గెలిచింది

పసికూన, అండర్ డాగ్ బిరుదులతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్ రెండు సార్లు ప్రపంచ కప్ ను అందుకున్న భారత్ ను గడగలాడించింది. చివరి వరకు తన అద్భుత [more]

Update: 2019-06-23 01:36 GMT

పసికూన, అండర్ డాగ్ బిరుదులతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్ రెండు సార్లు ప్రపంచ కప్ ను అందుకున్న భారత్ ను గడగలాడించింది. చివరి వరకు తన అద్భుత పోరాటంతో మాజీ ఛాంపియన్ ను ఓడించినంత పని చేసి పరాజయం పాలైనా క్రీడాభిమానుల మనసు గెలిచింది. పసికూనపై అతికష్టంపై నెగ్గినా టీం ఇండియా కు తాజా అనుభవం వచ్చే మ్యాచ్ లకు గుణపాఠం కానుంది. మొత్తానికి ఒక చిన్న జట్టుపై అతి తక్కువ స్కోర్ నమోదు చేసి బ్యాటింగ్ లో డొల్లతనాన్ని కోహ్లీ సేన గమనించడం ఒక ఎత్తయితే తమ బౌలింగ్ దళం ఆషామాషి గా లేదని ఒక అంశంలో విఫలం అయినా మరో దానిలో సత్తా చాటడం ఒక టీం గా గెలుపు తీరాలకు చేరుకుంటామని అభిమానులకు భరోసా ఇచ్చింది టీం ఇండియా.

సారధి తప్ప అంతా చేతులెత్తేశారు ….

వరుస విజయాలతో ప్రపంచ కప్ లో దూసుకుపోతున్న టీం ఇండియా తొలిసారి గట్టి కుదుపుకి గురయ్యింది. ఇప్పటివరకు వర్షం వల్ల రద్దయిన న్యూజిలాండ్ మ్యాచ్ మినహాయిస్తే టీం ఇండియా ప్రపంచ కప్ లో అప్రతిహతంగా దూసుకుపోతుంది. అయితే తాజాగా ఆఫ్ఘనిస్థాన్ పై నెగ్గడానికి భారత్ పడిన తిప్పలు ఏ మ్యాచ్ లోను పడలేదు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా భారీ స్కోర్ సాధిస్తుందనే అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆఫ్ఘన్ బౌలర్ల ధాటికి తోడు పిచ్ పై బౌన్స్ , టర్న్ అధికంగా ఉండటంతో స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ తో సహా అంతా క్యూ కట్టేశారు. కెప్టెన్ కోహ్లీ 67, కేదార్ జాదవ్ 52, రాహుల్ 30 తప్ప అంతా పెద్దగా రాణించింది లేదు. దాంతో నిర్ణిత 50 ఓవర్లకు టీం ఇండియా 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది.

కడదాకా పోరాడిన ఆఫ్ఘన్ …

స్వల్ప స్కోర్ ను ప్రత్యర్థి నుంచి కాపాడుకోవడం చాలా కష్టం. బలహీనమైన జట్లకు సైతం లో స్కోర్ సంచలనం చేసే అవకాశం కోసం పోరాడే ఆశ కల్పిస్తుంది. సరిగ్గా ఆఫ్ఘన్ లు అదే చేశారు. తమదైన శైలిలో భారత్ ను బెంబేలెత్తించారు. అయితే టీం ఇండియా బౌలర్లు సమిష్టిగా పసికూన పని పట్టేశారు. ముఖ్యంగా షమీ నాలుగు వికెట్లు కూల్చి మ్యాచ్ ను భారత పక్షానికి తిప్పాడు. చివరిలో అద్భుత హ్యాట్రిక్ తో ప్రపంచ కప్ లో ఈ రికార్డ్ సాధించిన రెండవ ఇండియన్ బౌలర్ గా నిలిచాడు. 1997 ప్రపంచ కప్ లో నాగపూరే లో న్యూజిలాండ్ పై చేతన్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ లో మహ్మద్ షమీ చేతన్ చెంత నిలిచాడు. షమీకి తోడు బుమ్రా, చాహల్, పాండ్య తలో రెండు వికెట్లు పడగొట్టి విజయం లో కీలక పాత్ర పోషించారు. చివరికి 213 పరుగులు కు ఆఫ్ఘన్ ఆలౌట్ అయ్యింది. ఆఫ్ఘన్ టీం లో ఒకపక్క వికెట్లు పడుతున్నా నబి (52) పరుగులు తో చేసిన పోరాటం, మేటి బ్యాట్స్ మెన్ ను పెవిలియన్ పట్టించి పరిమిత స్కోర్ కె టీం ఇండియా ను కట్టడి చేసిన ఆఫ్ఘన్ రాబోయే రోజుల్లో ప్రపంచ క్రికెట్ లో మరో పెద్ద టీం గా తమ అవతారం వుండబోతుందన్న సంకేతాలు పంపింది.

కోహ్లీ సేనకు వార్నింగ్ ….

వరుస విజయాలతో తిరుగులేదనుకున్న టీం ఇండియా ను అతి చిన్న జట్టు కూడా ఓటమి అంచులవరకు తీసుకువెళ్ళింది. ఇంకా కీలక మ్యాచ్ లు ఆడాలిసిన కోహ్లీ సేనకు ఈ పరిణామం మంచిదే అంటున్నారు విశ్లేషకులు. బ్యాటింగ్ లోపాలను సరిచేసుకోవడంతో బాటు ఏ ఒక్కరిని తక్కువ అంచనా వేయకూడదని జాగర్త పడే అవకాశాలు ఉన్నాయని కీలకమైన సెమిస్ వంటి మ్యాచ్ లకు తాజా అనుభవం పనికొస్తుందని చెబుతున్నారు.

Tags:    

Similar News