ఆ ఇద్దరి వల్లే బ్యాడ్ అట

రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ ప‌రిస్థితి ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం రాజ‌ధాని జిల్లాగా ఉన్న గుంటూరు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో పార్టీ ప‌రిస్థితి కొంత త‌డ‌బాటులో ఉంద‌ని [more]

Update: 2020-02-24 03:30 GMT

రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ ప‌రిస్థితి ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం రాజ‌ధాని జిల్లాగా ఉన్న గుంటూరు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో పార్టీ ప‌రిస్థితి కొంత త‌డ‌బాటులో ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గుంటూరులో ఒక‌రిద్దరు నేత‌లు రెచ్చిపోతుంటే మ‌రికొంద‌రు మాత్రం మౌనం పాటిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో పార్టీ ప‌రి స్థితి ఇబ్బందిక‌రంగా మారిపోయింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గుంటూరులో వైసీపీకి చెందిన నాయ‌కులు చాలా వివాద ర‌హితుల‌నే పేరు తెచ్చుకున్నారు. హోంమంత్రి సుచ‌రిత కానీ, మ‌రో మంత్రి మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ‌, సీనియ‌ర్లు ఆళ్ల రామ‌కృ ష్ణారెడ్డి, పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి వంటి వారు పార్టీకి విధేయులుగా ముద్ర ప‌డ్డారు.

సీనియర్ నేతలున్నా…..

ఇక‌, ఇదే జిల్లాల్లో సీనియ‌ర్లు అయిన‌ప్పటికీ జ‌గ‌న్ మాట కోసం, ఆయ‌న ఇచ్చిన పిలుపు మేర‌కు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, లేళ్ల అప్పిరెడ్డి వంటి వారు ఏకంగా త‌న సీట్లను త్యాగం చేశారు. అదేవిధంగా యువ నాయ‌కులు కూడా పార్టీకి విధేయులుగా ఉన్నారు. ఒక‌రికొక‌రు క‌ల‌గ‌లుపుకొని ముందుకు సాగుతున్నారు. అయితే, ఇది కొన్నాళ్ల కింద‌టి మాట‌. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి అలా లేదు. కేవ‌లం ఒకే ఒక్క మ‌హిళా నాయ‌కురాలు త‌న ఆధిప‌త్య ధోర‌ణిని ప్రద‌ర్శించేందుకు, త‌న పంతం నెగ్గించు కునేందుకు చేస్తున్న ప్రయ‌త్నంలో భాగంగా పార్టీలో ఒక‌రికొక‌రికి మ‌ధ్య విభేదాలు వ‌చ్చేలా అనుచ‌రుల‌నురెచ్చిగొడుతూ ప‌బ్బం గ‌డుపుకొంటున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

తొలిసారి గెలిచి…..

నిజానికి ఆమె గ‌త ఎన్నిక‌ల్లో ఒక కీల‌క నేత టికెట్ త్యాగం కార‌ణంగా, ప్రచారం కార‌ణంగా గెలిచి గుర్రమెక్కింది. అయితే, ఇప్పుడు త‌నే ఏక‌ఛ‌త్రాది ప‌త్యంగా పార్టీలో రికార్డు సృష్టించాల‌ని భావిస్తూ నియంత‌మాదిరిగా వ్యవ‌హ‌రిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప‌రిస్థితి వ‌ల్ల ఎంపీలు, ఎమ్మెల్యేల మ‌ధ్య ఉండాల్సిన సుహృద్భావ వాతావ‌ర‌ణం పూర్తిగా దెబ్బతిన్నద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా విష‌యానికి వ‌స్తే.. ఇక్కడ కూడా అంద‌రూ క‌లిసి మెలిసి ఉండేవారు. వైసీపీ నేత‌ల మ‌ధ్య సాన్నిహిత్యం కూడా ఎక్కువే. అయితే, ఒక వృద్ధ నాయ‌కుడు కార‌ణంగా నియోజ‌క‌వ‌ర్గాల మ‌ధ్య త‌లెత్తుతున్న విభేదాలు నాయ‌కుల వ‌ర‌కు పాకుతున్నాయి.

మంత్రి వల్లనే…?

ప్రస్తుతం జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న ఆ వృద్ధ నాయ‌కుడు.. త‌న‌కు సంబంధం లేని విష‌యాల్లో జోక్యం చేసుకోవ‌డం, త‌న‌కు సంబంధం లేని నియోజ‌క‌వ‌ర్గాల్లో వేలు పెట్టడం వంటివి చేస్తున్నారు. అంతేకాదు, నాయ‌కుల మ‌ధ్య కూడా విభేదాలు వ‌చ్చేలా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇక మ‌రో కీల‌క శాఖ‌కు మంత్రిగా ఉన్న నేత సైతం జిల్లాలో మిగిలిన నేత‌ల‌ను క‌లుపుకుని వెళ్లడం లేద‌ని అంటున్నారు. దీంతో ప‌శ్చిమ గోదావ‌రి వైసీపీలో విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. మ‌రి ఈ రెండు జిల్లాల్లో ప‌రిస్థితిని స‌రిదిద్దాల‌ని సూచిస్తున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి జ‌గ‌న్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో? ఆ నేత‌ల‌ను ఎలా స‌రిచేస్తారో చూడాలి.

Tags:    

Similar News